Monday, April 27, 2009

ఎవరన్నారు మానవత్వం చచ్చిపోయిందని...

ఈరోజు, మా కాలేజీ లో చెరకు రసం తీసి అమ్మే ఆతని చెయ్యి నలిగి పోయింది రసం తీసే మెషిన్ లో పడి. స్టూడెంట్ ఒకతను, ఆ చరకురసం అమ్మే అతనిని హాస్పిటల్ లో చేర్చాలి 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది, అందరు మీ మీ డోనేషన్స్ ఇవ్వండి అని మెయిల్ కొట్టాడు . ఆ మెయిల్ చూసిన నేను మా pg2 ల్యాబ్ లో వున్న 12 మంది స్నేహితుల దగ్గర డబ్బులు కలేక్ట్ చేస్తే 1000 రూ అయ్యాయి. ఆ డబ్బులు తీసుకొనే నేను వెళ్తే, ఆసరికే 2,500 దాకా అయ్యాయి డబ్బులు అది 20 నిముషాలలో. అప్పుడు అనిపించింది నాకు, ఎవరన్నారు మానవత్వం చచ్చిపోయిందని మా IIIT-Hyderabad స్టూడెంట్స్ లో ఇంకా బతికే వుంది అని..

Wednesday, April 22, 2009

IIIT-Hyderabad లో రెండు సంవత్సరాలు.............

అది నేను IIIT -H లో చేరే రోజు, 9:00 కల్లా వచ్చేయమన్నారు కాలేజీ లో జాయిన్ అవ్వటానికి ..8:50 కల్లా కాలేజీ వెళ్లి కూర్చున్నాను. తీరా అక్కడికి వెళ్తే అందరికి call letters పంపారు నాకు తప్ప. ఇక నా టెన్షన్ చూడాలి దేవుడా జాబు కి resign చేసి మరీ ఇక్కడ చేరటానికి వచ్చాను, ఇప్పుడు call letter లేదు నిన్ను చేర్చుకోమంటే ఏమి చెయ్యాలి రా అని. ఇంతలో ఇంకో టెన్షన్ ఫోటో లు compulsory అని చెప్పారు ఎవరో, నాదగ్గరేమో photo లు లేవు..ఇంక నా పరిస్థితి చూడాలి, దేవుడా నా జీవితాన్ని మంగళగిరి జాతర చేసావు కదయ్యా అనుకొన్నాను ....ఇంతలొ ఎవరో మేము ఆఫీసు లో కనుక్కోన్నాము call letter mandatory కాదంట, మెయిల్ వస్తే చాలంట అన్నారు. అమ్మయ్య ముందు కాలేజీ లో చేర్చుకొంటారు చాలు అనుకొన్నాను. అలా IIIT-Hyderabad లో నా జీవితం టెన్షన్ తో మొదలయింది.

మొదటిరోజు, ఏ ఏ classes ఎప్పుడు జరుగుతాయో time table పెట్టారు. వారానికి 4 రోజులే క్లాస్సేస్ అది రోజు కి maximum అంటే మూడు క్లాస్సులు...ఆహా సూపరు...అనవసరం గా job కి resign చేసాను శుభ్రం గా continue అయినా సరిపోయేది అని తెగ feel అయిపోయాను. మొదటివారం చాలా cool గా అయ్యాయి క్లాసులు..

రెండొవ వారం మొదలవ్వటం ఆలస్యం Assignmentlu start. లెగిస్తే APS (Advanced Problem Solving, full programming లెండి) assignment, కూర్చుంటే ITWS(ఇది కుడా ఒక subject లెండి మాకు first semster లో) assignment, పొడుకుంటే ComuperSystem(ఇది ఒక subject ఎ) project, gap దొరికితే Discrete Maths assignment. తినటానికి assignmentlu, తాగటానికి project లు ఇచ్చేవాళ్ళు. ప్రొద్దున 8:00 కి Hostel room నుంచి బయటపడితే, రాత్రి ఒకటో, రెండో అయ్యేది మల్లి రూమ్ కి వచ్చేప్పటికి. అసలు ఈ assignmentlu చెయ్యటానికి మేము పడిన కష్టం ఏ కొండలు పగల కొట్టడానికో పడితే, Hyderabad చుట్టుపక్కల ఒక్క కొండ కూడా మిగేలేది కాదు first semester అయ్యేపటికి. అప్పుడు అనిపించింది నాకు, GATE లో seat వచ్చి M.Tech చెయ్యడానికి వెళ్తే పెద్దగా చదవనవసరం లేదు అన్న వాడిని ఎడంకాలి చెప్పుతో కొట్టాలి అని.

రెండొవ వారం లోనే నాకు ఇంకో shock తగిలింది IIIT-H లో. మాకు assignmentla తో పాటు ఎప్పుడైనా కాళీ దొరికితే ఎక్కడ చెడిపోతామో అని ప్రతి వారం రెండు APS lab లు, ఒక ITWS lab పెట్టెవాళ్ళు. APS lab లో రెండు programs ఇస్తారు అవి మనం solve చేసి అదే రోజు రాత్రి 12:00 లోపు upload చెయ్యాలి. అర్దరాత్రి 12:00 కి deadline ఏంటి అనుకొంటున్నారా, అదంతే ఇక్కడ IIIT-H లో మేము దెయ్యాలు తిరిగే టైం లో తిరుగుతాం, మనుషులు తిరిగే టైం లో పడుకొంటాం. అలా అని మమ్మల్ని దెయ్యలనుకొంటే అది మీ ఖర్మ.

అది APS మొదటి lab మా APS TA (Teaching Assistent) లు, ఆ రోజు చెయ్యవలసిన రెండు program లు ఇచ్చారు. (అప్పటివరకు మా తొక్కలో SriJi college లో ఇక్కడ IIIT లో పిల్లోల్లు చడ్డిలేసుకోనేటప్పుడు చేసే programs చేసి పెద్ద programmer అని feel అయ్యేవాడిని. ) lab session లో మొదటి గంట అయ్యింది నాకు program ఏంటో ముక్క అర్ధం అయితే వొట్టు. అలా నేను జుట్టు పీక్కుంటూ వుండగా, ఒకడు లేసి నా program అయిపొయింది అని చెప్పాడు. నాకు sound లేదింక. ఆరోజు నేను ఆ రెండు programs అర్దరాత్రి 11:59:59 కి upload చేసాను. అదే వారం లో రెండో lab మల్లి రెండు programs ఇచ్చారు. మల్లి నాకు ముక్క కూడా అర్ధంకాలేదు (అని వేరే చెప్పాలా). మొదటి half అయ్యింది interval కొట్టటం ఆలస్యం ఒక అమ్మాయి లేచి నేను చేసేసాను programs అనింది. ఎదావిది గా నేను 11:59:59 కి upload చేసాను programs. అలా first semester అంతా deadline లతో పండగ చేసుకోన్నాం.

ఐతే పన్నెండేల్లకోసారి గోదావరి పుష్కరాలోచ్చినట్లు మాకు ఎప్పుడన్నా ఒక రోజు కాళీ దొరికేది ఇంక ఆరోజు జాతరే. అలా ఓరోజు మాకు కాళీ దొరికింది నేను ఇంకో ఇద్దరు స్నేహితులం కలసి సినిమా థియేటర్ చూసి రెండు నెలలు అయ్యిందని తెగ బాధపడి, ఒక గంట తీవ్రం గా చర్చలు జరిపి యమదొంగ సినిమాకి వెళ్దాం అని decide అయ్యాం. తీరా మెహదిపట్నం(సినిమా థియేటర్ వున్న ప్లేస్) వెళ్తే టికెట్లు అయిపోయాయి. ఇంకేముంది వుసూరుమంటూ వెనక్కితిరిగి వస్తూ దారిలో మిరపకాయ బజ్జీలు తినివచ్చాం. college దగ్గరికి వచ్చాక classamate ఒకడు ఎక్కడకిరా వెళ్లివస్తున్నారు అని అడిగాడు. మేమేదో ఎటకారం గా మెహిదిపట్నం వెళ్లి బజ్జీలు తిని వస్తున్నాం అంటే వాడు ఆశ్చర్యం గా అరేయ్ 12 కిలోమీటర్లు వెళ్ళే బజ్జిలు తిన్నారా మీరు, మీకు ఇక్కడ పక్కనే ఇందిరానగర్ లో బజ్జీలు దొరుకుతాయని తెలియదా అనేప్పటికి మేము అంతదూరం వెళ్లి tickets దొరకలేదు అనే బాధని మర్చిపోయి హాయిగా నవ్వేసాం.
అలా first semster మూడు assignmentlu ఆరు deadline ల తో గడిపేశాం.

మిగతా మూడు semester లు గురించి మనం తరవాతి బాగం లో మాట్లాడుకొందాం అంతవరకు సెలవు. ఎందుకంటే టైం పొద్దున్న 4:00 అయ్యింది కాబట్టి, నాకు నిద్రొస్తుంది కాబట్టి, రెండు రోజుల్లో ఒక project deadline వుంది కాబట్టి......

Wednesday, April 1, 2009

చదువు కష్టాలు...........

5 ఏళ్ల వయసు నుంచి మొదలు ఈ చదువు కష్టాలు. ఎవరన్నా చూడు ఈ ఒక్క తరగతి సరిగా చదువు ఇంక తరువాతి తరగతులు సరిగా చదవకపోయినా పరవాలేదు అని చెప్పేవారు.

10 వ తరగతి లో వున్నప్పుడు శ్రీను పొంతులు( ఊరిలొ అందరు అలాగే పిలుస్తారు) దగ్గరకు tuition కి వెళ్ళేవాడిని. ఆయన tuition లో ఒరేయ్ 10 వ తరగతి లొ మంచి మర్కులు తెచ్చుకోండి ఇంక ఎలా చదివినా ఒకటే అనే వాడు. ఏదో నా శక్తి కొద్ది చదివితే 428 మార్కు లు వచ్చాయి.

Intermediate లో join అయ్యాను, మొదటిరోజు నుంచి చావకోట్టే వాళ్ళు. ఒకటే చదవడం ప్రొద్దున్న 5 కు మొదలెడితే రాత్రి 10 వరకు చదవడమే చదవడం. ఈమద్య gap లో brain wash ఒకటి 900 మార్కు లు తెచ్చుకోండి చాలు, Engineering Degree Bits Pilanilo నుంచి చేతికి వచ్చినట్లే అనే చెప్పే వాళ్ళు, tutors దగ్గరనుంచి lecturer, principal దాక ఆందరూ. ముక్కి మూలిగి చదివితే 720 మార్కులు వచ్చాయి.

ఈ మధ్యలో EAMCET ఒకటి. ప్రతీ వారం ఒక రెండు రోజులు దీనికీ కేటాయించే వాళ్ళు. Intermediate లో మార్కులు రాకపోయినా పరవాలేదు EAMCET లో మంచి ర్యాంకు తెచ్చుకోండి చాలు అని చెప్పేవారు. ఇరగతీసి చదివితే 27,000 ర్యాంక్ వచ్చింది.

సరే మనకి workout కాలేదు అని B.SC లో చేరాను. మొదటి రోజు class లొ Computer Science Lecturer ఒరేయ్ మీరు B.SC లొ 70% మార్కులు తెచ్చుకోండి ఇక చూడండి రా మీ జీవితం అబ్బొ superuuu ఇంక చదవనవసరమే లెదు ఏదో ఒక University వాళ్ళు మీ కాళ్ళ వేళ్ళ పడి మీకు వాళ్ళ University lo seat ఇస్తారు( ఆ seat ఏంటో ఇప్పటికి తెలియలేదు) ...ఇంక కత్తిపట్టిన ఎంటివొడిలాగ చలరేగి పోయాను. ఎలాగైతేనేమి చెప్పినదానికన్నా 4% మార్కులు ఎక్కువే వచ్చాయి. ఇంకేముంది world top university ల వాళ్ళు అందరు మా ఇంటి ముందు Q కడతారని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసాను. కనీసం మా University (అదేనండి నేను B.SC చదివిన University మా The Great Acharya Nagarjuna University. Whole గుంటూరు లో world famous) వాళ్ళు కూడా రాలేదు.

సరే ఏమి చేద్దాం అనుకుంటూ వుంటే, స్నేహితుడు ఒకడొచ్చి ఒరేయ్ మామ అదేదొ MCA అంట అది చదివితే చాలంట నెలకి ఎంతలేదన్నా ఒక 50వేలు ఉద్యోగం guarantee అంట అన్నాడు . ఇక్కడ నేను అప్పటికే ఒక సాంగ్ వేసుకొచ్చాను Bangloore లోని Dreams Unlimited Software Solutions lo.

ICET coaching లొ చేరాను....మొదటిరోజు క్లాసు లో...మీరు ICET లొ మంచి ర్యాంక్ తెచ్చుకోండి చాలు మీ పేరు, మీ ఊరి పేరు చరిత్ర పుటల్లో శాశ్వతం గా నిలిచిపొతుంది, పైపెచ్చు MCA లో పెద్దగా చదవనవసరం కూడా లేదు(అదేదో bumper offer లాగ ..) ... ఇక్కడ నేను మనసులొ......ఆహ ఇప్పుడు కదా మన talent కి test...ఒక దెబ్బకి మూడు పిట్టలు...ర్యాంక్ , చరిత్రపుటల్లొ పేరు మళ్లీ చదవనవసరం లేదు.....

వేసవి మొదలయ్యింది...ఇక్కడ మా కొచింగ్ కష్టాలు మొదలయ్యాయి....arithmetic ఎంటో ఆ reasoning ఎంటో, ఒక్కముక్క అర్ధం అయితే మా రాజేష్ గాడిని చెప్పిచ్చుకు కొట్టండి ( రాజేష్ గాడి గురించి మనం ఇంకో టపా లో మాట్లాడుకొందాం).

అలా ఆ కష్టాలు జరుగుతూ వుండగా ఒక రోజు రాజేష్ గాడు ఒరేయ్ మన టాలెంట్ కి MCA కాదు రా M.Tech చదవాలి అన్నాడు. కానీ M.Tech చెయ్యాలంటే MCA కన్నా M.SC better రా అన్నాడు. MCA coaching గాలికొదిలేసి M.Sc entrance మీద పడ్డాను.

Osamani University లో నా talent అంతా ఉపయోగించి M.sc entrance రాస్తే 210 ర్యాంక్ వచ్చింది. జాగృతి అని ఒక కళాశాలలో నాకు ప్రవేశం లబించింది. సరే జాగృతి కళాశాల నన్ను జగృతపరుస్తుంది అనుకొన్నాను. అది నన్ను ఎంత జగృత పరిచిందంటే C Language lo a+b program కూడా కాపీ కొట్టేంతగా జగృత పరిచింది.

రెండు సంవత్సరాలు అయిపోయాయి. GATE coaching లో చేరాను ఎదావిదిగా మొదటిరోజు క్లాసు లో మంచి ర్యాంక్ వస్తే GATE లో M.Tech degree తో పాటు minimum నెలకో లక్ష రూపాయల ఉద్యోగం వస్తుంది పైపెచ్చు అసలు M.Tech 2 సంవత్సరాలు అసలు చదవనవసరం లేదు full ga enjoy చెయ్యటమే అని చెప్పారు.

జీవితం గిర్రు గిర్రు మని బొంగరం తిరిగినట్లు తిరిగి, ORACLE లో రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి, జీవితం మీద విరక్తి చెంది చివరాకరికి అనుకొన్నట్లు గానే IIIT-Hyderabad లో M.Tech చేరాను. జీవితం మీద బాగా విరక్తి చెంది వున్నానేమో మొదటి రోజు నుంచే enjoy చేద్దాం అని strong గా అనుకొన్నాను.

ఇక్కడ చూస్తే మొదటి రోజునుంచే కష్టాలు మొదలు...Assignment లు, Project లు రోజు రాత్రి దెయ్యాలు తిరిగే టైం లో deadline లు total గా నరకానికి spelling రాయించారు మొదటి Semester లోనే. ఇప్పుడు M.Tech చివరి నేలరోజులకోచ్చింది. stillu same నరకం same spellingu.

కానీ ఒక్కసారి వెనకకితిరిగి చూస్తే, అప్పటి కష్టాలన్నీ ఇప్పుడు ఇష్టం గా అనిపిస్తున్నాయి. దేవుడా నన్ను మళ్లీ నా 10 వ తరగతి రోజుల్లో పడేయ్యవా pleaseeeeeeeeeeeeeeee................

చివరిగా...ఈ టపా లో ఏమైనా తప్పులుంటే(Syntax Errors అన్నమాట) క్షమించగలరు...............