Sunday, May 10, 2009

మా అమ్మ
















చాల
మంది అంటూవుంటారు, తల్లి కి సహజం గా చిన్న కొడుకంటే ఇష్టం, తండ్రికి పెద్ద కొడుకంటే ఇష్టం అని ......మా ఇంట్లో నేను చిన్నవాడిని.....అందరి అమ్మలలాగానే మా అమ్మ కూడా కాకపోతే నా విషయం లో ఇష్టం అందరికంటే కొంచం ఎక్కువ....ఇప్పటికి మా అమ్మ నన్ను ఎప్పుడైనా బతిమాలలంటే మా చిన్న కదు మా కన్నా కాదు అంటూ వుంటుంది....మా అన్న కుళ్ళుకుంటూ వుంటాడు ఎప్పుడు నన్ను చూసి......మా అమ్మ దేనికైనా నన్ను పిలవటం ఆలస్యం, మా అన్న అందుకొని చిన్నా కన్నా ఎక్కడున్నావమ్మా అంటూవుంటాడు..

ఇప్పుడంటే ఇలా వుంది కాని నేను పుట్టినప్పుడు మా అమ్మ నన్ను నాకు వీడు వద్దు తీసుకెళ్ళి దిబ్బలో కొట్టండి అనిందంట...ఎందుకంటే మా అమ్మకి ఆడపిల్లలంటే చాల ఇష్టం..మా అన్నయ్య పుట్టిన తరువాత కాన్పులో ఆడపిల్ల పుడుతుంది అని చాలా ఆశ పడిందంట ....కాని నేను పుట్టేటప్పటికి నేను వాడి మొహం కూడా చూడను నాకు వద్దు అనిందంట .....నేను పుట్టిన హాస్పటల్ లో పనిచేసే డాక్టర్ నేను కనిపించిన ప్రతిసారి..ఏమ్మా వీడినే కదూ నువ్వు దిబ్బలో కొట్టమనింది అనే అడిగేవాడు......నేనైతే సిగ్గుతో చచ్చి పోయేవాడిని...

అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు నన్ను,మా అన్నని మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలి అమ్మ,నాన్న ఇద్దరూ కర్నాటక కి వ్యవసాయం కోసం వెళ్ళినప్పుడు మా అమ్మకళ్ళ లో ఎంత బాధ చూసానో....నేను ఇంటికివెళ్ళి తిరిగివచ్చే ప్రతిసారి మా అమ్మ కళ్ళలో అదే బాధ చూస్తాను....

నేను ఇంటికి వస్తున్నానని ఫోన్ చెయ్యడం ఆలస్యం నాకు ఇష్టం అని అట్లు కోసం అన్ని రెడీ చేసి పెట్టేస్తుంది......ఒక రోజు ఫోన్ చెయ్యకపోయినా ఒరేయ్ చిన్న నిన్న ఫోన్ ఎందుకు చెయ్యలేదు అని అడుగుతుంది.......ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం రాసేయవచ్చు...అందుకే నాకు ఎప్పుడూ గొప్పే మా అమ్మకి నేనంటే చాల ఇష్టం అని...

మళ్లీ జన్మంటూ వుంటే మా అమ్మకే కొడుకుగానే పుట్టాలి..అదీ చిన్న కొడుకుగానే పుట్టాలి.....

8 comments:

  1. great post Pal.... chaala bagundhi

    ReplyDelete
  2. mee korika teeraali.
    kaani ammaku peddakodukantene ekkuva prema vuntundi.chuudandi mari.

    ReplyDelete
  3. అమ్మ కోపం తాటాకు మంట లాంటిది ...ప్రేమ మాత్రం మన జీవితానికి వెలుగునిచ్చే అఖండ జ్యోతి !

    ReplyDelete
  4. నేను ఇంటికి వస్తున్నానని ఫోన్ చెయ్యడం ఆలస్యం నాకు ఇష్టం అని అట్లు కోసం అన్ని రెడీ చేసి పెట్టేస్తుంది.
    అందుకే అమ్మ అమ్మే. మరో పర్యాయపదమ్ లేదు.

    ReplyDelete
  5. మీ టపా చదువుతుంటే నేను చిన్నప్పుడెప్పుడో రాసుకున్న ఒక కవిత గుర్తు వస్తుంది. "అమ్మ అనే రెండక్షరాలు అనంత ప్రేమలోని మొదటి, చివరి అక్షరాలు" అని..మొత్తనికి మంచి టపా రాసినందుకు అభినందనలు.

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. anna chala baagundi 'maa amma'...

    maa amma anthe, maa thammudu ante chala istham...kanni naanu kooda chala isthapaduthadhi...

    anni baagundi anna...kaani aa foto theesesi... mee amma tho kaalisi okka foto thessi pedithe inka baaguntudi...

    disti ki em peduthamm...emmi vodhule... evari disti mana meeda padedi enti anna...

    allochinchaku.. foto thessi pettayi... :)

    saare nna...keep going with your blogs... :D

    ReplyDelete