Tuesday, May 19, 2009

క్రికెట్ నేర్చుకోవడం బ్రహ్మ విద్యే

అదో నడి వేసవి కాలం మిట్టమధ్యాహ్నం సమయం 12:౦౦ దైవాలరావూరు (అనగా మా వూరు, కానీ ఆటో వాళ్ళ దగ్గర నుంచి, బస్సు కండక్టరు వరకు అందరు దెయ్యాలరావూరు అని పిలేచివారే) టీం కి పమిడిపాడు టీం కి మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది మావూరి చవిటి పొలాల్లో. దైవాలరావూరు టీం ఇంకా 4 ఓవర్లు లో 60 పరుగులు చెయ్యాలి, చేతిలో 3 వికెట్స్ వున్నాయి. సమయం పన్నెండు మీదకి రాగానే బాట్స్మెన్ పోయేకాలం వచ్చే ఠపిమని అవుట్ అయ్యాడు. అప్పుడు దిగాడు ఒక బాట్స్మెన్, దొరకినది మొదలు బాలుని తుక్కురేగాకోట్టాడు. దైవాలరావురు టీం ని గెలిపించాడు. అతను కొట్టిన రున్స్ ఇలా వున్నాయి
6,4,6,4,6,1 | 4,6,4,6,6,1 | 6

అందరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బాట్స్మెన్ నే పైకిఎత్తి పొగడటం మొదలెట్టారు.. ఇంతకి ఆ బాట్స్మెన్ ఎవరో మీకు ఈపాటికే అర్ధం అయిపోయివుండాలి అది నేనే. నా క్రికెటింగ్ టాలెంట్ తెలిసిన వాళ్ళందరూ ఈ పాటికే షాక్ అయి వుంటారు. వాళ్ళందరు ముక్తకంఠం తో..ఇదంతా కలలో జరిగుంటుంది అని అంటారు...నిజమే ఇది జరిగిందీ కలలోనే..ఇదో పగటి కల...నాకు చిన్నప్పుడు క్రికెట్ గురించి తెలిసినప్పటినుంచీ కంటున్న కల ఇది...కాకపోతే అప్పట్లో పమిడిపాడు, దైవాలరావూరు ఐతే ఇప్పుడు ఇండియా, ఆస్ట్రేలియా టీం లు....

చాలామంది అడుగుతూ వుంటారు నన్ను అంత ఇంట్రెస్ట్ వున్నవాడివి ఆడటం నేర్చుకోవచ్చు గా అని....నేను నేర్చుకుందాం అనుకొన్న ప్రతిసారి టీం లో ఎవడో ఒక వెధవ వుంటాడు వాడు , మనం డిఫెన్స్ ఆడినా తిడతాడు, షాట్ లు కొట్టినా తిడతాడు..ఫీల్డింగ్ సరిగా చెయ్యకపోతే తిడతాడు...సరిగా చేద్దామని కిందపడి మరీ బాల్ ని ఆపితే ఏరా నువ్వేమన్నా తోపు అనుకొంటున్నావా ఏదో బాల్ దొరికింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమయేది extraa లు ఆపి మాములుగా చెయ్యి ఫీల్డింగ్ అంటాడు...నుంచుంటే తిడతాడు కూర్చుంటే తిడతాడు......ఇట్లాంటి పింజారి వెధవలతోటి మాటలు పడటం కంటే కదలకుండా కూర్చోవటం బెటరని నేర్చుకోలేదు. లేదు మా Z.P.H.S లో P.T నేర్పిస్తాడు అంటే ఆయనో --- --- (డాష్ డాష్) క్లాసు కో పది మంది పింజారి వెధవల్ని ఎన్నుకొని వాళ్ళకే volley ball నేర్పినా, లేదూ కబాడీ నేర్పినా, లేదూ ఇంకొంటి నేర్పినా......

అలా నాలో క్రికెట్ ఆడటం నేర్చుకోవాలనే కోరిక మాత్రం అలాగే వుండిపోయింది.....కానీ EA Sports వాళ్ళ క్రికెట్ గేమ్ లో మాత్రం మనం టాప్ అండోయ్....

8 comments:

  1. ఇప్పుడు మొదలెట్టండి. నే నేర్పుతా కావాలంటే :-)

    ReplyDelete
  2. పమిడిపాడు నిజంగా వుందా.. ..బాగా రాసారు.. EA sports 07 లో difficulty లెవెల్ 5 లో గేమ్ బావుంటుంది .

    ReplyDelete
  3. మీ వూళ్ళో కూడా దయ్యాలరావూరనే అంటారా? మా క్లాసులో(M.C.A. - PNCKR College, NRT) మీ వూరమ్మాయి ఒకరు వుండేవారు. ర్యాగింగ్ టైములో సీనియర్లు పాపం బాగానే ఏడిపించారు ఈపేరుతో.

    పోతే క్రికెట్ విషయంలో మనిద్దరం ఒకే పడవ ప్రయాణికులం. నేనూ ఇలాగే భారత జట్టు స్కోరు 9/4 ఓ, 10/6 ఓ వున్నప్పుడు నేను బరిలోకి దిగి ఆస్ట్రేలియాని చీల్చి చెండాడుతున్నట్లుగా కలలు కనేవాడ్ని. నాకు గల్లీ క్రికెట్ అంత సీను కూడా లేదని తెలిసాక భారత జట్టులో ఎవరైనా అలాంటి ఫీటు సాధిస్తే బాగుండనుకునేవాడిని. చాలారోజుల తర్వాత మన లక్ష్మణుడు నా కలని నిజం చేసి పెట్టాడు కలకత్తా టెస్టులో.

    ReplyDelete
  4. అబ్రకదబ్ర గారు, మీరు నేర్పుతానంటే నేర్చుకోవటానికి నేను రెడీ...

    @Vinay Chakravarthi, Thanks :-)

    హరే కృష్ణ గారు, ధన్యవాదాలు.. నిజంగానే పమిడిపాడు వుందండి బాబు.....EA sports 07 లో difficulty లెవెల్ 5 లో నేను నా ఫ్రెండ్ పందెం పెట్టుకొని చెరో ఇన్నింగ్స్ ఆడుతాం...ఆ మజాయే వేరు....

    బ్లాగాగ్ని గారు, హ్హ హ్హ...నాకైతే మా వురి పేరుని దయ్యాలరావూరని పిలిచేవాల్లని పట్టుకు కొట్టేద్దాం అనిపిస్తుంది.....మీకు క్రికెట్ ఆడటం రాదా? అయితే మీరు నా బాచ్చే అన్నమాట.....

    ReplyDelete
  5. అచ్చం మా నాన్న గారే మా నాన్నగారు కదా మీరు.. మీ కలలన్నీ మాకు తన ఊహలు గా చెప్పి రోజూ వాయించెసేవారు తను ఎలా టీం ఇండియాను గెలిపిస్తానో చూడండి అని

    ReplyDelete
  6. నేస్తం గారు :-)...ఎవరిని కదిలించినా నా కలల్లాంటి కలలు గురించి చెప్తారేమో కదు?

    ReplyDelete
  7. పింజారీ అంటే పింజలు జంద్యాలు వడికేవాడు http://nrahamthulla.blogspot.in/2013/07/blog-post.html

    ReplyDelete