Tuesday, May 19, 2009

క్రికెట్ నేర్చుకోవడం బ్రహ్మ విద్యే

అదో నడి వేసవి కాలం మిట్టమధ్యాహ్నం సమయం 12:౦౦ దైవాలరావూరు (అనగా మా వూరు, కానీ ఆటో వాళ్ళ దగ్గర నుంచి, బస్సు కండక్టరు వరకు అందరు దెయ్యాలరావూరు అని పిలేచివారే) టీం కి పమిడిపాడు టీం కి మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది మావూరి చవిటి పొలాల్లో. దైవాలరావూరు టీం ఇంకా 4 ఓవర్లు లో 60 పరుగులు చెయ్యాలి, చేతిలో 3 వికెట్స్ వున్నాయి. సమయం పన్నెండు మీదకి రాగానే బాట్స్మెన్ పోయేకాలం వచ్చే ఠపిమని అవుట్ అయ్యాడు. అప్పుడు దిగాడు ఒక బాట్స్మెన్, దొరకినది మొదలు బాలుని తుక్కురేగాకోట్టాడు. దైవాలరావురు టీం ని గెలిపించాడు. అతను కొట్టిన రున్స్ ఇలా వున్నాయి
6,4,6,4,6,1 | 4,6,4,6,6,1 | 6

అందరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బాట్స్మెన్ నే పైకిఎత్తి పొగడటం మొదలెట్టారు.. ఇంతకి ఆ బాట్స్మెన్ ఎవరో మీకు ఈపాటికే అర్ధం అయిపోయివుండాలి అది నేనే. నా క్రికెటింగ్ టాలెంట్ తెలిసిన వాళ్ళందరూ ఈ పాటికే షాక్ అయి వుంటారు. వాళ్ళందరు ముక్తకంఠం తో..ఇదంతా కలలో జరిగుంటుంది అని అంటారు...నిజమే ఇది జరిగిందీ కలలోనే..ఇదో పగటి కల...నాకు చిన్నప్పుడు క్రికెట్ గురించి తెలిసినప్పటినుంచీ కంటున్న కల ఇది...కాకపోతే అప్పట్లో పమిడిపాడు, దైవాలరావూరు ఐతే ఇప్పుడు ఇండియా, ఆస్ట్రేలియా టీం లు....

చాలామంది అడుగుతూ వుంటారు నన్ను అంత ఇంట్రెస్ట్ వున్నవాడివి ఆడటం నేర్చుకోవచ్చు గా అని....నేను నేర్చుకుందాం అనుకొన్న ప్రతిసారి టీం లో ఎవడో ఒక వెధవ వుంటాడు వాడు , మనం డిఫెన్స్ ఆడినా తిడతాడు, షాట్ లు కొట్టినా తిడతాడు..ఫీల్డింగ్ సరిగా చెయ్యకపోతే తిడతాడు...సరిగా చేద్దామని కిందపడి మరీ బాల్ ని ఆపితే ఏరా నువ్వేమన్నా తోపు అనుకొంటున్నావా ఏదో బాల్ దొరికింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమయేది extraa లు ఆపి మాములుగా చెయ్యి ఫీల్డింగ్ అంటాడు...నుంచుంటే తిడతాడు కూర్చుంటే తిడతాడు......ఇట్లాంటి పింజారి వెధవలతోటి మాటలు పడటం కంటే కదలకుండా కూర్చోవటం బెటరని నేర్చుకోలేదు. లేదు మా Z.P.H.S లో P.T నేర్పిస్తాడు అంటే ఆయనో --- --- (డాష్ డాష్) క్లాసు కో పది మంది పింజారి వెధవల్ని ఎన్నుకొని వాళ్ళకే volley ball నేర్పినా, లేదూ కబాడీ నేర్పినా, లేదూ ఇంకొంటి నేర్పినా......

అలా నాలో క్రికెట్ ఆడటం నేర్చుకోవాలనే కోరిక మాత్రం అలాగే వుండిపోయింది.....కానీ EA Sports వాళ్ళ క్రికెట్ గేమ్ లో మాత్రం మనం టాప్ అండోయ్....

Sunday, May 10, 2009

మా అమ్మ
















చాల
మంది అంటూవుంటారు, తల్లి కి సహజం గా చిన్న కొడుకంటే ఇష్టం, తండ్రికి పెద్ద కొడుకంటే ఇష్టం అని ......మా ఇంట్లో నేను చిన్నవాడిని.....అందరి అమ్మలలాగానే మా అమ్మ కూడా కాకపోతే నా విషయం లో ఇష్టం అందరికంటే కొంచం ఎక్కువ....ఇప్పటికి మా అమ్మ నన్ను ఎప్పుడైనా బతిమాలలంటే మా చిన్న కదు మా కన్నా కాదు అంటూ వుంటుంది....మా అన్న కుళ్ళుకుంటూ వుంటాడు ఎప్పుడు నన్ను చూసి......మా అమ్మ దేనికైనా నన్ను పిలవటం ఆలస్యం, మా అన్న అందుకొని చిన్నా కన్నా ఎక్కడున్నావమ్మా అంటూవుంటాడు..

ఇప్పుడంటే ఇలా వుంది కాని నేను పుట్టినప్పుడు మా అమ్మ నన్ను నాకు వీడు వద్దు తీసుకెళ్ళి దిబ్బలో కొట్టండి అనిందంట...ఎందుకంటే మా అమ్మకి ఆడపిల్లలంటే చాల ఇష్టం..మా అన్నయ్య పుట్టిన తరువాత కాన్పులో ఆడపిల్ల పుడుతుంది అని చాలా ఆశ పడిందంట ....కాని నేను పుట్టేటప్పటికి నేను వాడి మొహం కూడా చూడను నాకు వద్దు అనిందంట .....నేను పుట్టిన హాస్పటల్ లో పనిచేసే డాక్టర్ నేను కనిపించిన ప్రతిసారి..ఏమ్మా వీడినే కదూ నువ్వు దిబ్బలో కొట్టమనింది అనే అడిగేవాడు......నేనైతే సిగ్గుతో చచ్చి పోయేవాడిని...

అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు నన్ను,మా అన్నని మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలి అమ్మ,నాన్న ఇద్దరూ కర్నాటక కి వ్యవసాయం కోసం వెళ్ళినప్పుడు మా అమ్మకళ్ళ లో ఎంత బాధ చూసానో....నేను ఇంటికివెళ్ళి తిరిగివచ్చే ప్రతిసారి మా అమ్మ కళ్ళలో అదే బాధ చూస్తాను....

నేను ఇంటికి వస్తున్నానని ఫోన్ చెయ్యడం ఆలస్యం నాకు ఇష్టం అని అట్లు కోసం అన్ని రెడీ చేసి పెట్టేస్తుంది......ఒక రోజు ఫోన్ చెయ్యకపోయినా ఒరేయ్ చిన్న నిన్న ఫోన్ ఎందుకు చెయ్యలేదు అని అడుగుతుంది.......ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం రాసేయవచ్చు...అందుకే నాకు ఎప్పుడూ గొప్పే మా అమ్మకి నేనంటే చాల ఇష్టం అని...

మళ్లీ జన్మంటూ వుంటే మా అమ్మకే కొడుకుగానే పుట్టాలి..అదీ చిన్న కొడుకుగానే పుట్టాలి.....

Wednesday, May 6, 2009

IIIT-Hyderabad లో రెండు సంవత్సరాలు-II

మొదటిరోజు కాలేజీ లోకి అడుగుపెడుతూ...మా కాలేజీ గేటు దాటగానే వచ్చే సర్కిల్ చూడగానే అనుకొన్నాను...ఇక్కడే కామోసు నేను రెండు సంవత్సరాలు వుండబోతోంది అని..... ఎలాంటి ఫ్రెండ్స్ దొరుకుతారో...మళ్లీ కాలేజీ లైఫ్ ఎలావుంటుందో..మా క్లాసు లో ఎలాంటి అమ్మయిలుంటారో..ఇలా ఎన్నో ప్రశ్నలతో అడుగుపెట్టాను కాలేజీ లోకి...

నిన్న బయటకు వెళుతూ మళ్లీ ఆ సర్కిల్ ని చూడగానే అనిపించింది....ఏంటో ఈ రెండు సంవత్సరాలు ఎలా అయిపోయాయో కూడా తెలియలేదు..projectlu, assignmentlu అని.....ఇప్పుడు ఇంకో 15 రోజుల్లో కాలేజీ ని వదిలి వెళ్ళాలంటే కడుపోలోంచి బాధ తన్నుకు వస్తోంది....ఒక సారి వెనకు తిరిగి చూస్తే ఆహా ఈ రెండు సంవత్సరాలలో జివింతాంతం గుర్తుంచుకోవటానికి సరిపడా తీపి గుర్తులున్నాయి...

--మొదటి semestaer లో రాత్రంతా కూర్చొని చేసిన assignmentlu, projectlu...
--రెండో semester లో Software Engineering కోసం వేసిన skitlu...రవి గాడి రూం లో కూర్చోని చూసిన సినిమాలు...స్వామి గాడి మీద వేసిన satire లు....
--నేను రవి గాడు , రాజు, స్వామి, వెంకి గాడు కలిసి వెళ్ళిన విశాకపట్టణం ట్రిప్...
---amazon.com లో internship....
--మూడో semester లో DWDM క్లాసు లో వెంక బెంచిలో కూర్చొని చదివిన నవలలు...ITWS TAship...
--Amazon లో జాబు రాలేదని తెలిసన రోజు పడిన బాధ
--palcement coordinator గా నా చివరి మీటింగ్..దానిలో నేను మాట్లాడిన మాటలు..మాట్లాడలేక పోయిన మాటలు..
--ఇదిగో ఈరోజు క్లాసుమేట్స్ తో జరిగిన get together....

ఈక్షణం దేవుడు ప్రత్యక్షమైతే నేను ఏమి కోరిక కోరుకుంటానో తెలుసా.....దేవుడా కాలాన్నీ రెండు సంవత్సరాల ముందుకు తీసుకెల్లవా అని...ఏంటో ఇదంతా రాస్తుంటే కళ్ళలోకి నీళ్ళు ఎప్పుడోచ్చాయో కూడా తెలియలేదు...