Wednesday, May 6, 2009

IIIT-Hyderabad లో రెండు సంవత్సరాలు-II

మొదటిరోజు కాలేజీ లోకి అడుగుపెడుతూ...మా కాలేజీ గేటు దాటగానే వచ్చే సర్కిల్ చూడగానే అనుకొన్నాను...ఇక్కడే కామోసు నేను రెండు సంవత్సరాలు వుండబోతోంది అని..... ఎలాంటి ఫ్రెండ్స్ దొరుకుతారో...మళ్లీ కాలేజీ లైఫ్ ఎలావుంటుందో..మా క్లాసు లో ఎలాంటి అమ్మయిలుంటారో..ఇలా ఎన్నో ప్రశ్నలతో అడుగుపెట్టాను కాలేజీ లోకి...

నిన్న బయటకు వెళుతూ మళ్లీ ఆ సర్కిల్ ని చూడగానే అనిపించింది....ఏంటో ఈ రెండు సంవత్సరాలు ఎలా అయిపోయాయో కూడా తెలియలేదు..projectlu, assignmentlu అని.....ఇప్పుడు ఇంకో 15 రోజుల్లో కాలేజీ ని వదిలి వెళ్ళాలంటే కడుపోలోంచి బాధ తన్నుకు వస్తోంది....ఒక సారి వెనకు తిరిగి చూస్తే ఆహా ఈ రెండు సంవత్సరాలలో జివింతాంతం గుర్తుంచుకోవటానికి సరిపడా తీపి గుర్తులున్నాయి...

--మొదటి semestaer లో రాత్రంతా కూర్చొని చేసిన assignmentlu, projectlu...
--రెండో semester లో Software Engineering కోసం వేసిన skitlu...రవి గాడి రూం లో కూర్చోని చూసిన సినిమాలు...స్వామి గాడి మీద వేసిన satire లు....
--నేను రవి గాడు , రాజు, స్వామి, వెంకి గాడు కలిసి వెళ్ళిన విశాకపట్టణం ట్రిప్...
---amazon.com లో internship....
--మూడో semester లో DWDM క్లాసు లో వెంక బెంచిలో కూర్చొని చదివిన నవలలు...ITWS TAship...
--Amazon లో జాబు రాలేదని తెలిసన రోజు పడిన బాధ
--palcement coordinator గా నా చివరి మీటింగ్..దానిలో నేను మాట్లాడిన మాటలు..మాట్లాడలేక పోయిన మాటలు..
--ఇదిగో ఈరోజు క్లాసుమేట్స్ తో జరిగిన get together....

ఈక్షణం దేవుడు ప్రత్యక్షమైతే నేను ఏమి కోరిక కోరుకుంటానో తెలుసా.....దేవుడా కాలాన్నీ రెండు సంవత్సరాల ముందుకు తీసుకెల్లవా అని...ఏంటో ఇదంతా రాస్తుంటే కళ్ళలోకి నీళ్ళు ఎప్పుడోచ్చాయో కూడా తెలియలేదు...

5 comments:

  1. Nice post Narendra.... A lot of memories :)

    ReplyDelete
  2. enti brother meeru kuda ela rastara ???

    ReplyDelete
  3. ఇది అందరికీ అనుభవమే.తప్పదు మరి.
    నా బాధని ఇలా రాసుకున్నాను.
    "అప్పటి వరకు బాధ అంటే తెలీదు
    అందం గా అల్లుకున్న స్నేహ బంధాలు తప్ప
    కన్నీళ్ళు అంటే తెలీదు
    నవ్వి నవ్వి కనుచెలమలు నిండడం తప్ప

    కష్టాలంటే తెలీదు
    నేస్తాలతో చిన్న చిన్న అలుకలు తప్ప
    విడిపోవడం అంటే తెలీదు
    చేతిలో చేయెసి సాయంత్రాలు నడవడం తప్ప

    మౌనంగ వుండడం తెలీదు
    సెలయేరులా గల గలా మాట్లాడడం తప్ప
    మరి ఈరోజేమిటి..

    నవ్వులన్ని జ్ఞాపకాల్లో చేరిపోతున్నాయి
    అందమయిన బంధాలన్ని ఆటోగ్రాఫ్ లో
    భాషగా మారిపోతున్నాయి
    మనసులేమిటి మాటలని దాచేస్తున్నాయి

    వీడుకోలు చెప్పడం అంత కష్టమా?

    అరే...ఇదేమిటి?
    ఆకాశంలో కదా మేఘాలున్నాయి
    మా కన్నుల్లో వర్షం కురుస్తుందేమిటి? "

    ReplyDelete
  4. hmm..రాధిక గారు ,నరేంద్ర గారు మళ్ళీ ఆ రోజులను గుర్తు చేసారు

    ReplyDelete
  5. రాధిక గారు, నా మనసులో వున్న భావాలని కవితలా రాస్తే ఇలానే వుంటుంది.. చాల బాగా రాసారు...

    నేస్తం గారు :-)

    ReplyDelete