Saturday, November 21, 2009

బాచిలర్ గా నా కష్టాలు-I

IIIT-Hyderabad లో వున్న అన్ని రోజులు జీవితం ప్రశాంతం గా గడిచిపోయింది...అడపాదడపా ప్రాజెక్టులు ఎప్పుడు assignmentlu తప్ప మిగతా జీవితం అంతా పూలపాన్పు లాగా వుండేది.......ఒకసారి IIIT నుంచి బయటపడ్డాక అర్ధం అయ్యింది జీవితం పూలపాన్పు కాదు కంకర రోడ్ అని (టెక్నికల్ గా చెప్పాలంటే జీవితమంటే assignemntlu, projectule కాదు వుండటానికి ఇల్లువేతుక్కోవడం, తినడానికి భోజనం వండుకోవడం కూడానని.....)

కాలేజీ నుంచి బయటికి వచ్చాక మొదట మిస్ అయింది కాలేజీ మెస్ నే... మా కాలేజీ మెస్ లో భోజనం ఎంత చండాలంగా వున్నా, ఒకటికి మూడు మెస్ లు వుండడంతో ఎలాగో ఒకలా తినేసేవాళ్ళం...ఆదివారం వస్తే మా ఆస్థాన Restaurant K.K.D (కదిలి వచ్చిన కనకదుర్గ) కి వెళ్ళేవాళ్ళం. మా కాలేజీ కి దగ్గరలో(నడుచుకుంటూ వెళ్ళేంత) ఈ ఒక్క Restaurant వుండటం తో, వున్న మిగతావన్నీ pizzaa లు (తెలుగు లో చెత్త) Burger(తెలుగు లో చెదారం) అమ్మేవే వుండడం తో ఎప్పుడు ఈ Restaurant కే వెళ్ళే వాళ్ళం. ఐన మా Restaurant ల visiting గురించి పెద్ద కధే వుంది ఆ కధ గురుంచి ఇంకో టపా లో చూద్దాం. ఇప్పటి రోజులకొస్తే, ..రూమ్మేట్ లు ఎంత చండాలం గా వంట చేసిన తినవలసిందే..లేదంటే కాలేజీ రోజులని గుర్తు తెచ్చుకొని ఏడవడమే..ఇంకా ఏడుపు రాకపోతే మన తోడని మనమే గిల్లుకొని ఏడవడమే. ఈ విషయం లో ఇంకో తలనోప్పెంటంటే వారం లో రెండు/మూడు రోజులు మనం వంట చెయ్యాలి. ఆఫీసు నుంచి వచ్చి హాయిగా కాసేపు ఎ పుస్తకమైనా చదువుకొందాం , లేదు ఏదైనా సినిమా చూద్దాం అంటే అబ్బే ఎక్కడ వంట చెయ్యాలి అంటారు రూమ్మేట్ లు. పైపెచ్చు ఎంతో కష్టపడి వంట చేస్తే కూరలో వుప్పు తగ్గిందనో లేకపొతే, అన్నం మెత్తగా వుందనో అంటారు. ఆ టైం లో ఒక్కసారి ఇంట్లో వున్న రోజులు గుర్తువస్తాయి. పొద్దునే నిద్రలేచి అమ్మమ్మ ఎంతో కష్టపడి, కాలేజీ లో మద్యాన్నం తినడానికి భోజనం, పొద్దునే తినడానికి టిఫిన్ చేసి పెడితే, ఎన్ని సార్లు అది బాగోలేదు ఇది బాగోలేదు అని అరిచే గందరగోళం చేసానో గుర్తుకొస్తుంది. అప్పుడోసారి అద్దం ముందుకెళ్ళి ఛి నీమొకం మీద కాకి రెట్టెయ్య అని రవితేజ స్టైల్ లో చెయ్యాలనిపిస్తుంది(మనలో మనమాట చాల సార్లు చేశాకూడా ) . ఈ వంట కష్టాలు చెప్తే తీరేవి కాదు, అవి అనుభవించి తెలుకోవలసిన కష్టాలు.

ఉపసంహారం
==========
మొన్నీమధ్య ఒక శుక్రవారం రాత్రి చికెన్ సెంటర్ కి వెళ్ళాం నేను నా రూమ్మేట్ ఒకడు కలిసి..ఎంత చికెన్ తీసుకోవాలి, ఎవడు వండాలి అని మాట్లాడు కొంటు వుండగా ఒకతనోచ్చి ఏంటి తమ్ముడు ఏంటి ఏమి చేస్తున్టావ్ నువ్వు అని అడిగాడు, తరవాత మా రూమ్మేట్ ని అడిగాడు. మేము చెప్పాక ఏంటి దేని గురించి మాట్లాడుకొంటున్నారు వీకెండ్ పార్టీ గురించా? .ఎంజాయ్ చెయ్యండి తమ్ముడు ఇప్పుడే ఎంజాయ్ చెయ్యాలి, పెళ్లి అయ్యాక ఇదిగో నాలాగా ఉసూరు మంటూ మార్కెట్ రావాలి అన్ని తీసుకువెళ్ళాలి, పెళ్ళాం ఎలా చేసిపెడితే అల తినాలి అంటూ తెగ బాధపడిపోయాడు...అప్పుడు నేను మావోడు ఒకడి మొకం ఒకడు చూసుకొని..ఇలా అనుకొన్నాం పీత బాధలు పీతవి, సీత బాధలు సీతవి...ఇంకో టపా లో బాచిలర్ లు అద్దెకి ఇల్లు అనే కాన్సెప్ట్ తో కలుద్దాం

Sunday, November 1, 2009

అలా తెలిసింది నాకు సైట్ వుందని...

అవి నేను కొత్తగా జాబు లో చేరిన రోజులు. నాకు, నాతొపాటు చేరిన ఇంకో ఒకడికి కలిపి ఒక మెంటార్(రమేష్ బండారి) వుండే వాడు. తను ప్రతిదానికీ క్లాస్సులు పీకుతూ వుండేవాడు. అప్పట్లో నేను software engineer అనేవాడు సిస్టం reselution చాలా తక్కువ పెట్టుకొని సిస్టం వైపు కళ్ళు చికిలించుకొని చూడాలి అనుకొనే వాడ్ని.
అలా నేను సిస్టం చూడడం చూసి చూసి ఒకరోజు మా మెంటార్ వచ్చి నీకు సైట్ వుంది అందుకే సిస్టం వైపు అలా కళ్ళు చికిలించుకొనే చూస్తావు, అర్జెంటు గా eye టెస్ట్ చేఇంచుకో అన్నాడు, అప్పుడు నేను, పిచ్చోడా ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నాకేంటి సైటు ఏమిటి? neverrr, నీకు తెలిదా software engineer అనేవాడు సిస్టం వైపు అలా కళ్ళు చికిలించుకొని చూడాలి అన్నాను. తనేమో అంతలేదు నేను నీలాగే అనుకొనే వాడ్ని, ఇప్పుడు చూస్తున్నావ్ గా నా అద్దాలు, ముందు టెస్ట్ చేఇంచుకో అన్నాడు. నేను ఆ మాటలు పెద్దగా పట్టించుకోలేదు. అలా రోజులు జరుగుతూ వున్నాయి. రమేష్ ఎప్పుడు నా desk దగ్గరకు వచ్చినా నా eye సైట్ గురించే మాట్లాడే వాడు.

ఒకరోజు నాకు కొంచం దూరంగా కూర్చునే మా ఫ్రెండ్ డెస్క్ వైపు చూసాను డెస్క్ మీద వుండే వాడి పేరు సరిగా కనిపించలేదు, ఏంటో బూసర బూసర గా కనిపించింది. అప్పుడు వచ్చింది నాకు అనుమానం , కొంపతీసి నాకు సైట్ వుందా ఏంటి! అని. ఇంకా ఆరోజు నుంచి ఆఫీసుకి వచ్చేటప్పుడు, ఆఫీసు నుంచి వెళ్ళేటప్పుడు బస్సులోంచి రోడ్ మీద వున్న షాపుల పేర్లు, hording ల మీద వున్న అక్షరాలు చదవడానికి ట్రై చేసివాడిని. దూరంగా వున్న అక్షరాలు చూసినపుడు అవి సరిగా కనిపించేవే కాదుకదా పైపెచ్చు డాన్స్ చేస్తున్నట్లు కనిపించేవి. కాని నేను అంతా నా భ్రమా, బ్రాంతి మనకు సైట్ ఏంటి అబ్బే ఛాన్స్ లేదు అనుకొనే వాడిని.

కాలక్రమంలో ఇంకో 3 నెలలు జరిగిపోయాయి. ఒక మంచి(one fine) వీకెండ్ లో సరదాగా సినిమాకి వెళ్ళాను. కొంతసేపు అయ్యాక పక్కనే వున్న మా ఫ్రెండ్ తోటి ఒరేయ్ అంత సీరియస్ సీన్ లో ఎంట్రా ఆ హీరోగాడు డాన్స్ చేస్తున్నాడు అన్నాను. అపుడు వాడు ఒరేయ్ మీ మెంటార్(రమేష్ బండారి) చెప్పేది నిజమే నువ్వు అర్జెంటు గా eye టెస్ట్ చేఇంచుకో అన్నాడు. ఆ తరువాతి వారమే L.V Prasadh eye hospital కే వెళ్ళాను. అన్ని టెస్ట్లు అయినతరువాత డాక్టర్ స్లోమోషన్ లో కళ్ళఅద్దాలు తీసి బాబు నీకు సైట్ వుందమ్మా అన్నాడు. ఇంకేముంది సినిమాల్లో చూఇంచి నట్లు సముద్రాలూ పొంగాయి, మెరుపులు మెరిసాయి, పిడుగులు పడ్డాయి. నేను గట్టిగా డాక్టర్ ర్ ఏంటి మీరు చెప్పిడి అని NTR లెవెల్లో అడిగాను, అప్పుడు డాక్టర్ అంత లేదమ్మా నీకొచ్చింది సైట్, కాన్సర్ కాదు అంత ఎమోషనల్ డ్రామా అవసరం లేదని ప్రేస్క్రిప్షన్ రాసిచ్చాడు.


అలా నాకు సైట్ వుందనే విషయం తెలిసిందారోజు. సైట్ వస్తే వచ్చింది కాని కళ్ళ అద్దాలు వచ్చాయి :-) ఇంకా ఎవర్ని అద్దాలివ్వవా ఒకసారి పెట్టుకు చూస్తాను అని అడగనవసరం లేదు అని, నాకు నేను సర్ది చెప్పుకొన్నాను.


Thanks
Narendra Chennupati