అవి నేను కొత్తగా జాబు లో చేరిన రోజులు. నాకు, నాతొపాటు చేరిన ఇంకో ఒకడికి కలిపి ఒక మెంటార్(రమేష్ బండారి) వుండే వాడు. తను ప్రతిదానికీ క్లాస్సులు పీకుతూ వుండేవాడు. అప్పట్లో నేను software engineer అనేవాడు సిస్టం reselution చాలా తక్కువ పెట్టుకొని సిస్టం వైపు కళ్ళు చికిలించుకొని చూడాలి అనుకొనే వాడ్ని.
అలా నేను సిస్టం చూడడం చూసి చూసి ఒకరోజు మా మెంటార్ వచ్చి నీకు సైట్ వుంది అందుకే సిస్టం వైపు అలా కళ్ళు చికిలించుకొనే చూస్తావు, అర్జెంటు గా eye టెస్ట్ చేఇంచుకో అన్నాడు, అప్పుడు నేను, పిచ్చోడా ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నాకేంటి సైటు ఏమిటి? neverrr, నీకు తెలిదా software engineer అనేవాడు సిస్టం వైపు అలా కళ్ళు చికిలించుకొని చూడాలి అన్నాను. తనేమో అంతలేదు నేను నీలాగే అనుకొనే వాడ్ని, ఇప్పుడు చూస్తున్నావ్ గా నా అద్దాలు, ముందు టెస్ట్ చేఇంచుకో అన్నాడు. నేను ఆ మాటలు పెద్దగా పట్టించుకోలేదు. అలా రోజులు జరుగుతూ వున్నాయి. రమేష్ ఎప్పుడు నా desk దగ్గరకు వచ్చినా నా eye సైట్ గురించే మాట్లాడే వాడు.
ఒకరోజు నాకు కొంచం దూరంగా కూర్చునే మా ఫ్రెండ్ డెస్క్ వైపు చూసాను డెస్క్ మీద వుండే వాడి పేరు సరిగా కనిపించలేదు, ఏంటో బూసర బూసర గా కనిపించింది. అప్పుడు వచ్చింది నాకు అనుమానం , కొంపతీసి నాకు సైట్ వుందా ఏంటి! అని. ఇంకా ఆరోజు నుంచి ఆఫీసుకి వచ్చేటప్పుడు, ఆఫీసు నుంచి వెళ్ళేటప్పుడు బస్సులోంచి రోడ్ మీద వున్న షాపుల పేర్లు, hording ల మీద వున్న అక్షరాలు చదవడానికి ట్రై చేసివాడిని. దూరంగా వున్న అక్షరాలు చూసినపుడు అవి సరిగా కనిపించేవే కాదుకదా పైపెచ్చు డాన్స్ చేస్తున్నట్లు కనిపించేవి. కాని నేను అంతా నా భ్రమా, బ్రాంతి మనకు సైట్ ఏంటి అబ్బే ఛాన్స్ లేదు అనుకొనే వాడిని.
కాలక్రమంలో ఇంకో 3 నెలలు జరిగిపోయాయి. ఒక మంచి(one fine) వీకెండ్ లో సరదాగా సినిమాకి వెళ్ళాను. కొంతసేపు అయ్యాక పక్కనే వున్న మా ఫ్రెండ్ తోటి ఒరేయ్ అంత సీరియస్ సీన్ లో ఎంట్రా ఆ హీరోగాడు డాన్స్ చేస్తున్నాడు అన్నాను. అపుడు వాడు ఒరేయ్ మీ మెంటార్(రమేష్ బండారి) చెప్పేది నిజమే నువ్వు అర్జెంటు గా eye టెస్ట్ చేఇంచుకో అన్నాడు. ఆ తరువాతి వారమే L.V Prasadh eye hospital కే వెళ్ళాను. అన్ని టెస్ట్లు అయినతరువాత డాక్టర్ స్లోమోషన్ లో కళ్ళఅద్దాలు తీసి బాబు నీకు సైట్ వుందమ్మా అన్నాడు. ఇంకేముంది సినిమాల్లో చూఇంచి నట్లు సముద్రాలూ పొంగాయి, మెరుపులు మెరిసాయి, పిడుగులు పడ్డాయి. నేను గట్టిగా డాక్టర్ ర్ ఏంటి మీరు చెప్పిడి అని NTR లెవెల్లో అడిగాను, అప్పుడు డాక్టర్ అంత లేదమ్మా నీకొచ్చింది సైట్, కాన్సర్ కాదు అంత ఎమోషనల్ డ్రామా అవసరం లేదని ప్రేస్క్రిప్షన్ రాసిచ్చాడు.
అలా నాకు సైట్ వుందనే విషయం తెలిసిందారోజు. సైట్ వస్తే వచ్చింది కాని కళ్ళ అద్దాలు వచ్చాయి :-) ఇంకా ఎవర్ని అద్దాలివ్వవా ఒకసారి పెట్టుకు చూస్తాను అని అడగనవసరం లేదు అని, నాకు నేను సర్ది చెప్పుకొన్నాను.
Thanks
Narendra Chennupati
Sunday, November 1, 2009
Subscribe to:
Post Comments (Atom)
హమ్మయ్య తెలిసింది కదా సైట్ ఉందని. గ్లాసెస్ ఫ్రేమ్ ఎక్కడ కొన్నారేంటి? ఇది పెద్ద ప్రశ్నా? అని తీసి పారెయ్యకండి. ఫ్రేమ్ ఎక్కడ కొన్నామో అన్న విషయం నేను కాలేజీ లో ఉన్న రోజుల్లో అయితే పెద్ద prestige ఇష్యూ.
ReplyDeletewell written i enjoyed every word of it. By the way can u translate it into english coz i dont understand telgu [:P]
ReplyDelete:) ఇలాంటివి చదివినదగ్గర నుండి భయమెస్తుంది..ప్రస్తుతానికి సైట్ లేదుకాని వస్తుందేమో అని .. కళ్ళ జోడు అంటే మహ చెడ్డభయం నాకు
ReplyDeletekiranmayi గారు, మీరు చెప్పింది నిజమే...ఎ ఫ్రేమ్ కొనాలి అని నేను చేసిన హడావిడి గురుంచి ఇంకో టపా రాయవచ్చు.....ప్రతీ 2 నెలలకోసారి అద్దాలు పగలకోడుతువుంటాను నేను..కాని ఇప్పటికి మొదటిసారి తీసుకొన్న ఫ్రేమ్ లాంటిదే కావాలని అడిగి తిసుకొంటువుంటాను.
ReplyDeleteనేస్తం గారు, మీరు అలా బయపడితే ఎలా...అందుకే ఫ్రెండ్స్ వి స్పెక్ట్స్ అడిగి తీసుకొని పెట్టుకొని చుసుకొంటూవుండాలి :-) ...
ReplyDeleteNitin, Thanks a lot for your comment dude...Good to hear that you liked my post ;)..sure 'll send you the translated version of it...
ReplyDeletehi nari so chala rojula taruvata neku nuvvuga teluskolekapoyina vishayanni snehutula dwara telusukunnavu.
ReplyDelete