Tuesday, January 12, 2010

ఏవి ఆ భోగి సంబరాలు??

చిన్నప్పుడు, సంక్రాంతి పండగోస్తుందంటే సంబరమే సంబరం. ఎందుకంటే ఎ పండగకి  బట్టలు కొనకపోయినా సంక్రాంతి పండగకి మాత్రం కచ్చితంగా కొత్త బట్టలు కొనిపెట్టేవాళ్ళు.

ఇంకోటి భోగి, ఆ రోజు జరిగే భోగి మంట పందాలు. ప్రతి బజారులో ఎవడు పెద్ద భోగి మంట వేస్తాడు అని పందెం. గెలిసినవాడు  ఆ రోజు చొక్కా కాలరు ఎగరేసి ఊరంతా తిరిగి వాడి గెలుపు గురించి కధలు కధలు గా చెప్పే వాడు. భోగి మంట పందెం లో గెలవాలంటే అంత  వీజీ కాదు. దానికి మంచి strategy కావాలి దాన్ని పక్కా గా అమలు చెయ్యాలి. మా అన్న దీనిలో మంచి పండితుడు(strategist) . మా బజార్లో ఎప్పుడు మేమో గెలిచే వాళ్ళం.

మేము 5-7 తరగతులు మా అమ్మమ్మ వాళ్ళ వూళ్ళో చదివాము. అక్కడ కారుమంచి గడ్డి అని, బాగా జొన్న చొప్పంత ఎత్తు పెరుగుతుంది. మేము సంక్రాంతి నెల పెట్టటం ఆలస్యం ప్రతి ఆదివారం ఆ గడ్డి కోసుకు రావటం ఎండ పెట్టటం. భోగి రెండు రోజులు వుంది అనంగా వాటిని చిన్న చిన్న మోపులు కట్టి నిలపెట్టే వాళ్ళం. ఇంక భోగి రోజు వాటికీ మంట పెడితే ఆకాశానికి తాకుతున్నాయా అన్నంత ఎత్తు మండేవి. ఇంకేముంది మా బజరులోనే కాదు పక్క బజారులో కూడా మేమే కింగులు.

7-10 మా ఊర్లో అక్కడ జొన్న చొప్ప, మొక్కజొన్న కంకేల మీద వుండే పొత్తులు పండగ టైం కి బాగా దొరికేవి. భోగిరోజుకి వీలైనంత ఎక్కువ వీటిని పోగేయ్యటం ఓ రెండు మూడు గంటలు మంట వెయ్యటానికి సరిపడా "అన్న"మాట. ఇంకా ఆ రోజు సాయంత్రం దివిటిల ఆట... అంటే, జొన్న చొప్పకి చివర మంట పెట్టి తిప్పుతూ వుంటారు. మనకి దివిటి తిప్పే అనంత సీన్ లేదు కాని, కూర్చొని దివిటి తిప్పటం చూడడం ఒక సరదా అంతే.

కానీ ఇప్పుడు ఏవి ఆ సంబరాలు. పొద్దు పొద్దునే ఆఫీసు కి వస్తూ ఆ రోజులని గుర్తుకు తెచ్చుకోవటం తప్ప.

10 comments:

  1. సంక్రాంతి శుభాకాంక్షలు .

    ReplyDelete
  2. భోగి పర్వదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  3. మాలా కుమార్ గారు, మీకు కూడా భోగి పర్వదిన శుభాకాంక్షలు...

    ReplyDelete
  4. విజయమోహన్ గారు, మీకు కూడా భోగి పర్వదిన శుభాకాంక్షలు..

    ReplyDelete
  5. అవును... బోగీ లేదు.. సంక్రాంతీ లేదు...

    మంటలేసుకుని ఆనందపు పొగలో మునగాల్సిన మనం...
    ట్రాఫిక్ జామ్లలో ఇరుక్కుని కాలుష్యపుపొగను త్రాగుతున్నాం..

    బోగిరోజున బగ్ ఫిక్సులు చేసుకుంటున్నాం...
    కోడిపందాలకు బదులు.. కోడ్ రివ్వూలతో కొట్టుకుంటున్నాం..

    పిండివంటల రుచులను తలచుకుంటూ..
    తినే టైము దొరక్క... మినీ మీల్స్ తో సరిపెట్టుకుంటున్నాం..

    సంక్రాతి గంగిరెద్దులా పైఉద్యోగికి... పైసాకి.. తలవంచి.. తలాడిస్తున్నాం...

    మన సంప్రదాయాలను మన తరమే దూరమై..నెమరువేసుకుంటున్నాం...
    ఇక మన పిల్లలకైతే... అవి ఒక ఎడ్వెంచరస్ కధలుగా చెప్పుకోవాలేమో??

    ReplyDelete
  6. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ భోగి మంటల అనుభవాలు చదువుతుంటే ప్రళయకావేరి కథలు గుర్తుకొస్తున్నాయి.

    ReplyDelete
  7. శ్రీనివాస రాజు,
    +++++++++మన సంప్రదాయాలను మన తరమే దూరమై..నెమరువేసుకుంటున్నాం...
    ఇక మన పిల్లలకైతే... అవి ఒక ఎడ్వెంచరస్ కధలుగా చెప్పుకోవాలేమో??+++++++++

    పొద్దున్న ఈ టపా రాయడానికి ముందు మా రూమ్మేట్ నేను ఈ విషయం గురించి చాలా సేపు మాట్లాడుకొన్నాం....

    ReplyDelete
  8. సిరిసిరిమువ్వ గారు, ధన్యవాదాలు...
    నా టపా చదివితే మీకు ప్రళయకావేరి కథలు గుర్తుకోచ్చినందుకు చాల సంతోషం...

    ReplyDelete
  9. srinivas garu mee comment chala bavundi !!!!!

    ReplyDelete
  10. నమస్కారం.
    మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
    సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
    తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును.
    సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి.
    సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం.
    మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో సమూహము లింకు ను వుంచి ప్రోత్సహించండి. సమూహము లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి .
    దయచేసి మీ సలహను / సూచలను ఇక్కడ తెలపండి మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
    -- ధన్యవాదముతో
    మీ సమూహము

    ReplyDelete