Tuesday, July 27, 2010

మొదటి స్నేహితుడు......

ఎప్పుడు మొదలైందో మా స్నేహం నాకు సరిగా గుర్తు లేదు, ఉహ రాకముందునుంచి అనుకొంటాను. మా  నాయనమ్మ  పరిచయం చేసిందట వాడ్ని నాకు మా అమ్మ చెప్తుంది. ఆతరవాత వాడు కనిపించక పోతే అన్నం కూడా తినేవాడ్ని కాదట ఇది కూడా మా అమ్మే చెప్పింది.

కోపం వచ్చిన, బాధొచ్చినా, సంతోషం వచ్చినా నేను మొదట చెప్పేది వాడికే. నా జ్ఞాపకాల దొంతరల్లో ప్రతి పుటా వాడికి పరిచయం.  వాడ్ని మొదటిసారి చూసినప్పుడు ఎంత ఆనందం వేసిందో నాకు గుర్తులేదు కాని వాడ్ని కలిసిన ప్రతిసారి ఏదో తెలియని ఆనందం. 

వాడు నాకు పరిచయం అయ్యింది మొదలు ఇంత వరకు వాడ్ని కలవకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు నేను. వాడు నా మొదటి స్నేహితుడు వాడి పేరు TEA.

5 comments:

  1. write tomorrow about your second friend with a picture .Coffee

    ReplyDelete
  2. క్రింద అంత పెద్ద బొమ్మ పెట్టారా అయినా ఎవరబ్బా అనేసుకుంటున్నా :) మొత్తానికి టీ లేకుండా ఉండలేనంటారు :)

    ReplyDelete
  3. Kiran, Sure...

    నేస్తం, హ హ...
    tea లేకుండా కష్టమే..

    ReplyDelete
  4. anna .... neelo okka manchi kavi unnadu !!!!!

    ReplyDelete
  5. రఘు, ఏదో నీ అభిమానం :-)

    ReplyDelete