Saturday, November 21, 2009

బాచిలర్ గా నా కష్టాలు-I

IIIT-Hyderabad లో వున్న అన్ని రోజులు జీవితం ప్రశాంతం గా గడిచిపోయింది...అడపాదడపా ప్రాజెక్టులు ఎప్పుడు assignmentlu తప్ప మిగతా జీవితం అంతా పూలపాన్పు లాగా వుండేది.......ఒకసారి IIIT నుంచి బయటపడ్డాక అర్ధం అయ్యింది జీవితం పూలపాన్పు కాదు కంకర రోడ్ అని (టెక్నికల్ గా చెప్పాలంటే జీవితమంటే assignemntlu, projectule కాదు వుండటానికి ఇల్లువేతుక్కోవడం, తినడానికి భోజనం వండుకోవడం కూడానని.....)

కాలేజీ నుంచి బయటికి వచ్చాక మొదట మిస్ అయింది కాలేజీ మెస్ నే... మా కాలేజీ మెస్ లో భోజనం ఎంత చండాలంగా వున్నా, ఒకటికి మూడు మెస్ లు వుండడంతో ఎలాగో ఒకలా తినేసేవాళ్ళం...ఆదివారం వస్తే మా ఆస్థాన Restaurant K.K.D (కదిలి వచ్చిన కనకదుర్గ) కి వెళ్ళేవాళ్ళం. మా కాలేజీ కి దగ్గరలో(నడుచుకుంటూ వెళ్ళేంత) ఈ ఒక్క Restaurant వుండటం తో, వున్న మిగతావన్నీ pizzaa లు (తెలుగు లో చెత్త) Burger(తెలుగు లో చెదారం) అమ్మేవే వుండడం తో ఎప్పుడు ఈ Restaurant కే వెళ్ళే వాళ్ళం. ఐన మా Restaurant ల visiting గురించి పెద్ద కధే వుంది ఆ కధ గురుంచి ఇంకో టపా లో చూద్దాం. ఇప్పటి రోజులకొస్తే, ..రూమ్మేట్ లు ఎంత చండాలం గా వంట చేసిన తినవలసిందే..లేదంటే కాలేజీ రోజులని గుర్తు తెచ్చుకొని ఏడవడమే..ఇంకా ఏడుపు రాకపోతే మన తోడని మనమే గిల్లుకొని ఏడవడమే. ఈ విషయం లో ఇంకో తలనోప్పెంటంటే వారం లో రెండు/మూడు రోజులు మనం వంట చెయ్యాలి. ఆఫీసు నుంచి వచ్చి హాయిగా కాసేపు ఎ పుస్తకమైనా చదువుకొందాం , లేదు ఏదైనా సినిమా చూద్దాం అంటే అబ్బే ఎక్కడ వంట చెయ్యాలి అంటారు రూమ్మేట్ లు. పైపెచ్చు ఎంతో కష్టపడి వంట చేస్తే కూరలో వుప్పు తగ్గిందనో లేకపొతే, అన్నం మెత్తగా వుందనో అంటారు. ఆ టైం లో ఒక్కసారి ఇంట్లో వున్న రోజులు గుర్తువస్తాయి. పొద్దునే నిద్రలేచి అమ్మమ్మ ఎంతో కష్టపడి, కాలేజీ లో మద్యాన్నం తినడానికి భోజనం, పొద్దునే తినడానికి టిఫిన్ చేసి పెడితే, ఎన్ని సార్లు అది బాగోలేదు ఇది బాగోలేదు అని అరిచే గందరగోళం చేసానో గుర్తుకొస్తుంది. అప్పుడోసారి అద్దం ముందుకెళ్ళి ఛి నీమొకం మీద కాకి రెట్టెయ్య అని రవితేజ స్టైల్ లో చెయ్యాలనిపిస్తుంది(మనలో మనమాట చాల సార్లు చేశాకూడా ) . ఈ వంట కష్టాలు చెప్తే తీరేవి కాదు, అవి అనుభవించి తెలుకోవలసిన కష్టాలు.

ఉపసంహారం
==========
మొన్నీమధ్య ఒక శుక్రవారం రాత్రి చికెన్ సెంటర్ కి వెళ్ళాం నేను నా రూమ్మేట్ ఒకడు కలిసి..ఎంత చికెన్ తీసుకోవాలి, ఎవడు వండాలి అని మాట్లాడు కొంటు వుండగా ఒకతనోచ్చి ఏంటి తమ్ముడు ఏంటి ఏమి చేస్తున్టావ్ నువ్వు అని అడిగాడు, తరవాత మా రూమ్మేట్ ని అడిగాడు. మేము చెప్పాక ఏంటి దేని గురించి మాట్లాడుకొంటున్నారు వీకెండ్ పార్టీ గురించా? .ఎంజాయ్ చెయ్యండి తమ్ముడు ఇప్పుడే ఎంజాయ్ చెయ్యాలి, పెళ్లి అయ్యాక ఇదిగో నాలాగా ఉసూరు మంటూ మార్కెట్ రావాలి అన్ని తీసుకువెళ్ళాలి, పెళ్ళాం ఎలా చేసిపెడితే అల తినాలి అంటూ తెగ బాధపడిపోయాడు...అప్పుడు నేను మావోడు ఒకడి మొకం ఒకడు చూసుకొని..ఇలా అనుకొన్నాం పీత బాధలు పీతవి, సీత బాధలు సీతవి...ఇంకో టపా లో బాచిలర్ లు అద్దెకి ఇల్లు అనే కాన్సెప్ట్ తో కలుద్దాం

7 comments:

 1. బాగా సరదాగా రాశారు. :-)
  అన్నట్టు వంట బాధితుల్లో నేను కూడా ఒకణ్ణి.

  ReplyDelete
 2. "పెళ్ళాం ఎలా చేసిపెడితే అల తినాలి అంటూ తెగ బాధపడిపోయాడు..."
  అవును కరెక్ట్ గానే చెప్పాడు. ఈ కాలపు పెళ్ళాల వంట భరించటం చాలా కష్టం. కొదో గొప్పో మగ పిల్లలే బాచిలర్ గా ఉండే రోజులలో వంట నేర్చుకుంటున్నారు. ఆడ పిల్లలు సెక్యూరిటీ కోసమని హాస్టళ్ళ లో ఉండటం వలన వాళ్ళకి వంట అస్సలు తెలవటం లేదు. మళ్ళీ తినక పోతే తెగ ఫీలవుతారు...

  ReplyDelete
 3. ha ha idi nijam.

  ee rojullo chaduvukunna ammayila kante chaduvukunna abbayilake vanta baaga vachu.
  maa friends lo kontamandiki pelli ayina kottallo vaalla hubby ne vanta nerpinchaaranta.
  wife ki vanta vachaka maatram veellu vanta illu ekkada vundo kooda marchipotarata. naa friend cheppindi tana experiance.

  Narendra Garu, baagaa vraasaaru.

  ReplyDelete
 4. tappadu mari.. konnallaki ade alavatayipotundi.. :D

  ReplyDelete
 5. @ ravichandrae గారు, మీ కామెంట్ కి థాంక్స్ :-)
  @ bondalapati గారు, మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి...

  ReplyDelete
 6. @ jahnavi గారు, మీ కామెంట్ కి థాంక్స్ :-)..మరి వైఫ్ వచ్చినతరువాతా కూడా డైలీ వంట చెయ్యాలంటే కష్టం కదండీ..ఏదో ఎపుడైనా ఒకసారైతే ఓకే..ఏమంటారు...

  @ telugabbai గారు .. బాగాచేప్పారండి...

  ReplyDelete
 7. narendra garu,ponlendi me vanta kastalu twaralo terutay..........

  ReplyDelete