10 వ తరగతి లో వున్నప్పుడు శ్రీను పొంతులు( ఊరిలొ అందరు అలాగే పిలుస్తారు) దగ్గరకు tuition కి వెళ్ళేవాడిని. ఆయన tuition లో ఒరేయ్ 10 వ తరగతి లొ మంచి మర్కులు తెచ్చుకోండి ఇంక ఎలా చదివినా ఒకటే అనే వాడు. ఏదో నా శక్తి కొద్ది చదివితే 428 మార్కు లు వచ్చాయి.
Intermediate లో join అయ్యాను, మొదటిరోజు నుంచి చావకోట్టే వాళ్ళు. ఒకటే చదవడం ప్రొద్దున్న 5 కు మొదలెడితే రాత్రి 10 వరకు చదవడమే చదవడం. ఈమద్య gap లో brain wash ఒకటి 900 మార్కు లు తెచ్చుకోండి చాలు, Engineering Degree Bits Pilanilo నుంచి చేతికి వచ్చినట్లే అనే చెప్పే వాళ్ళు, tutors దగ్గరనుంచి lecturer, principal దాక ఆందరూ. ముక్కి మూలిగి చదివితే 720 మార్కులు వచ్చాయి.
ఈ మధ్యలో EAMCET ఒకటి. ప్రతీ వారం ఒక రెండు రోజులు దీనికీ కేటాయించే వాళ్ళు. Intermediate లో మార్కులు రాకపోయినా పరవాలేదు EAMCET లో మంచి ర్యాంకు తెచ్చుకోండి చాలు అని చెప్పేవారు. ఇరగతీసి చదివితే 27,000 ర్యాంక్ వచ్చింది.
సరే మనకి workout కాలేదు అని B.SC లో చేరాను. మొదటి రోజు class లొ Computer Science Lecturer ఒరేయ్ మీరు B.SC లొ 70% మార్కులు తెచ్చుకోండి ఇక చూడండి రా మీ జీవితం అబ్బొ superuuu ఇంక చదవనవసరమే లెదు ఏదో ఒక University వాళ్ళు మీ కాళ్ళ వేళ్ళ పడి మీకు వాళ్ళ University lo seat ఇస్తారు( ఆ seat ఏంటో ఇప్పటికి తెలియలేదు) ...ఇంక కత్తిపట్టిన ఎంటివొడిలాగ చలరేగి పోయాను. ఎలాగైతేనేమి చెప్పినదానికన్నా 4% మార్కులు ఎక్కువే వచ్చాయి. ఇంకేముంది world top university ల వాళ్ళు అందరు మా ఇంటి ముందు Q కడతారని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసాను. కనీసం మా University (అదేనండి నేను B.SC చదివిన University మా The Great Acharya Nagarjuna University. Whole గుంటూరు లో world famous) వాళ్ళు కూడా రాలేదు.
సరే ఏమి చేద్దాం అనుకుంటూ వుంటే, స్నేహితుడు ఒకడొచ్చి ఒరేయ్ మామ అదేదొ MCA అంట అది చదివితే చాలంట నెలకి ఎంతలేదన్నా ఒక 50వేలు ఉద్యోగం guarantee అంట అన్నాడు . ఇక్కడ నేను అప్పటికే ఒక సాంగ్ వేసుకొచ్చాను Bangloore లోని Dreams Unlimited Software Solutions lo.
ICET coaching లొ చేరాను....మొదటిరోజు క్లాసు లో...మీరు ICET లొ మంచి ర్యాంక్ తెచ్చుకోండి చాలు మీ పేరు, మీ ఊరి పేరు చరిత్ర పుటల్లో శాశ్వతం గా నిలిచిపొతుంది, పైపెచ్చు MCA లో పెద్దగా చదవనవసరం కూడా లేదు(అదేదో bumper offer లాగ ..) ... ఇక్కడ నేను మనసులొ......ఆహ ఇప్పుడు కదా మన talent కి test...ఒక దెబ్బకి మూడు పిట్టలు...ర్యాంక్ , చరిత్రపుటల్లొ పేరు మళ్లీ చదవనవసరం లేదు.....
వేసవి మొదలయ్యింది...ఇక్కడ మా కొచింగ్ కష్టాలు మొదలయ్యాయి....ఆ arithmetic ఎంటో ఆ reasoning ఎంటో, ఒక్కముక్క అర్ధం అయితే మా రాజేష్ గాడిని చెప్పిచ్చుకు కొట్టండి ( రాజేష్ గాడి గురించి మనం ఇంకో టపా లో మాట్లాడుకొందాం).
అలా ఆ కష్టాలు జరుగుతూ వుండగా ఒక రోజు రాజేష్ గాడు ఒరేయ్ మన టాలెంట్ కి MCA కాదు రా M.Tech చదవాలి అన్నాడు. కానీ M.Tech చెయ్యాలంటే MCA కన్నా M.SC better రా అన్నాడు. MCA coaching గాలికొదిలేసి M.Sc entrance మీద పడ్డాను.
Osamani University లో నా talent అంతా ఉపయోగించి M.sc entrance రాస్తే 210 ర్యాంక్ వచ్చింది. జాగృతి అని ఒక కళాశాలలో నాకు ప్రవేశం లబించింది. సరే జాగృతి కళాశాల నన్ను జగృతపరుస్తుంది అనుకొన్నాను. అది నన్ను ఎంత జగృత పరిచిందంటే C Language lo a+b program కూడా కాపీ కొట్టేంతగా జగృత పరిచింది.
రెండు సంవత్సరాలు అయిపోయాయి. GATE coaching లో చేరాను ఎదావిదిగా మొదటిరోజు క్లాసు లో మంచి ర్యాంక్ వస్తే GATE లో M.Tech degree తో పాటు minimum నెలకో లక్ష రూపాయల ఉద్యోగం వస్తుంది పైపెచ్చు అసలు M.Tech 2 సంవత్సరాలు అసలు చదవనవసరం లేదు full ga enjoy చెయ్యటమే అని చెప్పారు.
జీవితం గిర్రు గిర్రు మని బొంగరం తిరిగినట్లు తిరిగి, ORACLE లో రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి, జీవితం మీద విరక్తి చెంది చివరాకరికి అనుకొన్నట్లు గానే IIIT-Hyderabad లో M.Tech చేరాను. జీవితం మీద బాగా విరక్తి చెంది వున్నానేమో మొదటి రోజు నుంచే enjoy చేద్దాం అని strong గా అనుకొన్నాను.
ఇక్కడ చూస్తే మొదటి రోజునుంచే కష్టాలు మొదలు...Assignment లు, Project లు రోజు రాత్రి దెయ్యాలు తిరిగే టైం లో deadline లు total గా నరకానికి spelling రాయించారు మొదటి Semester లోనే. ఇప్పుడు M.Tech చివరి నేలరోజులకోచ్చింది. stillu same నరకం same spellingu.
కానీ ఒక్కసారి వెనకకితిరిగి చూస్తే, అప్పటి కష్టాలన్నీ ఇప్పుడు ఇష్టం గా అనిపిస్తున్నాయి. దేవుడా నన్ను మళ్లీ నా 10 వ తరగతి రోజుల్లో పడేయ్యవా pleaseeeeeeeeeeeeeeee.........
చివరిగా...ఈ టపా లో ఏమైనా తప్పులుంటే(Syntax Errors అన్నమాట) క్షమించగలరు...............
ya ya inni kashtalu paduthunna, time manage chesi BLOG rasavu ga.. gudu gudu.
ReplyDeletemaaku roju cheppe sollega malli kottaga edoka ------(neeku telusu kadaaaa)
ReplyDeleteAny way nice tapaaaaa!!!!!! keep it up!!!!
ReplyDeleteSuper Mamu
ReplyDeleteinni kastaalu paduthu chadva ka poothe .. manchi center okati choosukookudadu.. :)
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteహాయ్ పిట్చ్ కాక్ ........
ReplyDeleteబాగానే రాసావు చిన్నప్పటి సదువు విషయాలు .........
చక్కని విషయం మీద చాలా బాగా రాసారు .. :)
ReplyDeleteOka blog,,nee jeevitham tho paatu oka manchi CINEMA SCRIPT kuda raasaavu...
ReplyDeleteSalaam Comrade..... :)
నేస్తం గారు చాలా Thanks అండీ :) ... మీలాంటి Seniors appreciations ఎ, మా లాంటి juniors కి స్పూర్తి....
ReplyDelete@Ravi...naa script tho movie thisthey hero nuvve...director venki gaadu.....raju nirmata....Ravi gadu swami gadu perkshakulu emantav ;)
ReplyDeleteHi Naren
ReplyDeleteGreat man! Superb ga rasavu. Keep it up. I am eagerly waiting for Rajesh gadi tapa ;).
హ హ చక్కగా రాయగలిగే ప్రతిభ ఉంటే సీనియర్ జూనియర్ ఏముంది అండి ..మీలాగే వచ్చిన కొత్తలో ఒక్కరన్నా నేను రాసింది చదువుతున్నారా,నాకు అసలు రాయడం సరిగా వచ్చా అనుకునేదాన్ని :)
ReplyDeleteనా జీవితంలో అత్యంత మధురఘట్టం - మాస్టర్స్ లో సివరాఖరి పరీక్ష రాసి బయటకు రావడం. నా వరకు చదువు అయిపోయిన తర్వాతే నిజయమయిన జీవితాన్ని, అంటే నాకు ఇష్టమొచ్చిన/నచ్చిన రీతిలో, ఎంజాయ్ చేస్తున్నాను!
ReplyDeleteఅఫ్‌కోర్స్ ఆ చదువు లేకుంటే ఇలా ఉండేవాడిని కాదు కానీ.... జీవితంలో మళ్ళీ ఇంకోసారి కాలేజీకెళ్ళను.
నేస్తం గారు నేను కూడా అలాగే feel అవుతున్నానండి..
ReplyDeleteజీడిపప్పు గారు..మీరు చెప్పింది నిజమే..మనం ఎంత తిట్టుకొన్నా చదువే లేకపోతే, మనం ఈ పోటి ప్రపంచం లో ఎలా బ్రతకగలం అని తలుచుకొంటే భయం వేస్తుంది..
ReplyDeleteనేను మాత్రం పరిస్థితులు అనుకూలం గా లేవు కాని లేకపోతే P.hd చేస్తానండి..
This comment has been removed by the author.
ReplyDeleteChala manchi blog anna,
ReplyDeletea kadha naa kadha laghey undi( atleast graduation varakhu)
gr8 work.
Hey, Thanks Sainath :)
ReplyDeleteఏదో జోకులోలా, అలవాటవ్వలేదా చివరాకరి చదువుకన్నా?
ReplyDeleteసిన్నప్పటినుండి ఇన్టానే ఉన్నావా? మరి ఈ పాటికి అలవాటైపొవ్వాలా వద్దా అద్దెచ్చా?
నాకు ఒకటో తరగతి అవ్వంగనే అలవాటైపోయింది.
ఓ సిన్న సూచన - కామెంటెట్టేకాడ వర్డ్ వెరిఫికేషను పీకెయ్.
మీకందరికీ చదువయి పోయాక మధుర ఘట్టాలా ? ఎట్టాగబ్బా ? ఎక్కడో నా లాజిక్కు తన్నినట్టుందే ...
ReplyDeleteమా శర్మ గాడి పేపర్ లాక్కోని laplace transformation కాపీ గొట్టగలానా మళ్ళీ ( final exams) ? లేకా మా వాణీ industrial tour జీవితంలో మర్చిపోగలదా? మా checkpost ప్రొఫెసర్ లాంటి వాళ్ళు మళ్ళీ చదువు చెప్తారా? లైబ్రరీ రాక్ ల మధ్య మా ఊసులాటలు ఇప్పుడు చేద్దామన్నా మా ఆవిడ ఇరగ తీయదా? జూనియర్స్ మీద దాదాగిరి మళ్ళీ చేయగలనా లేక వరస బెట్టి ౪ సినిమాలు మళ్ళీ చూడగలనా?
దేనికీ లాజిక్కు దొరకడంలా...
నా కాలేజి రోజులు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు నరేంద్ర గారు. అవునూ భాస్కరూ మన జిల్లా వోడని ఇంతలేటుగానా చెప్పేది.
నేనైతే దేవుడిని ఒకటో తరగతిలో పదేయ మని అడుగుతా.. నా 'కష్టాలు' అక్కడినుంచి మొదలయ్యాయి మరి.. బాగా రాశారండి..
ReplyDeleteఅన్నట్టు.. భాస్కర్ గారు చెప్పాక కూడా వర్డ్ వెరిఫికేషన్ తీయక పోడాన్ని ఖండిస్తున్నా:)
ReplyDeleteనరేంద్ర,
ReplyDeleteచాలా సరదాగా రాశారు. నన్నైతే ఇతర భవసాగరాలు ఏమీ తగిలించకుండా "చదూకోమ్మా" అంటే ఎప్పుడూ హాయిగా చదువుకుంటూ (నవలలు కాదు) ఉండిపోతా!
అన్నట్లు మా గుంటూర్లో వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీ ని ఎవరైనా ఏమైనా అంటే నాకు భలే కోపం వస్తుంది మరి! నా డిగ్రీ ఆ యూనివర్సిటీ నుంచే తీసుకున్నా!
భాస్కర్ రామరాజు గారు కామెంటెట్టేకాడ వర్డ్ వెరిఫికేషను పీకేసాను.
ReplyDeleteచెయ్యగలనా, చూడగలనా అంటూ చాలా విషయాలు చెప్పారు... మీరు మీ memories మా తో పంచుకోవచ్చుకదా?
అవ్వటానికి నేను ప్రకాశం జిల్లా వాడిని అయినా నా +2 అక్కడే చేసాను.. మా నియోజకవర్గం కూడా గుంటూరు జిల్లాలోనే వుంది....
మురళి గారు నా బ్లాగ్ మీకు నచ్చినందుకు థాంక్స్.....
ReplyDeleteనన్ను ఇక్కడ project deadlines తో చంపేస్తున్నారండి...నిన్న రాత్రి 12 కి deadline వుంది..అందువల్ల comments కి reply ఇవ్వటం కుదరలేదు...
సుజాత గారు, నా బ్లాగ్ మీకు నచ్చినందుకు థాంక్స్..... నేను కూడా నా B.SC Nagarjuna University లోనే చేసాను....నాకు కుడా కోపం వస్తుంది ఎవరన్నా మన University నే ఎమన్నా అంటే..
ReplyDeleteఅయినా ఎవడో అంటే కోపం వస్తుంది గాని, మనకి మనమే అనుకొంటే కోపం రాదు కదా...ఏమంటారు?
నరేంద్ర గారు, భాస్కర రామరాజునేమో పూర్తిపేరుతో సంబోధించారు,నన్నేమో సగంపేరు కూడా పిలవలేదే :( waa,waaaaaaaa, waaaaa ( crying )
ReplyDeleteఓ తప్పకుండా టైం దొరికితే ఈ సారి మెమొరీస్ నే బ్లాగుతా.
ఇంతకీ ప్రకాశం లో ఏవూరు మనది?
భాస్కర రామి రెడ్డి గారు, మీ ఇద్దరి పేర్లలో భాస్కర వుంది కదా....నేను సరిగా చూడలేదు..మీరు ఇద్దరు.. ఒక్కరే అనుకొన్నాను. దైవాలరావూరు అని అద్దంకి కి దగ్గరలో వుంటుంది మా స్వగ్రామమైన ఒక కుగ్రామం....
ReplyDeleteబాసూ మనం పుల్లు కన్ఫ్యూజు ఐనట్టు ఉన్నావ్.
ReplyDeleteఏం పర్లేదు. ఇట్టాంటివి కాలేజు ఏజులో మావూలే.
భా.రా.రె ఏరు నేను ఏరు.
మన్ది పల్నాడు తాలూకా. దాస్పల్లి పట్టణవ్.
అదీ కత.
నేనో ముప్పై నాలుగు బ్లాగులు (నిజంగా సెప్పాలన్టే ఎనిమిది) రాత్తా. ఓపిక ఉన్టే సదువ్.
టయవ్ ఉన్టే ఈడ ఓకాలూ సెయ్యి ఎయ్యి http://paatapaatalu.blogspot.com/2009/01/blog-post.html
సరేగానీ ఓ దరమ సన్దేసం - నాగార్జునా యూనివర్సిటీలో బీయస్సీ ఆడున్దీ? నేనైతే నాగార్జునా యూనివసిటీకి అప్లియేటు కాలేజి, దాన్నే హిందూ కాలేజి గర్తపురి అన్టార్లే, ఆడా సదివినా. యూనివర్సిటీకాడ బీయస్సీ యాడున్దీ?
ReplyDeleteఏన్దో అన్నీ పెస్నలే పొద్దున లేచిన కాణ్నుంచి.
భాస్కర్ రామరాజు గారు, మీరు చెప్పినట్లే, నాగార్జునా విశ్వవిద్యాలయం లో B.SC లేదండి. నేను చదివింది శ్రిజి డిగ్రీ కాలేజీ, ఒంగోలు లో..అది నాగార్జునా విశ్వవిద్యాలయం కు affiliated కాలేజీ...మీ దరమ సన్దేసం తీరినట్లేనా?
ReplyDeleteమీరు హిందూ కాలేజీ లో చదివారా!! నేను నా +2 లో మొదటి సంవత్సరం పరిక్షలు అక్కడే రాశాను
చాల బాగా రాసారు ...ఇప్పుడే మీ మానవత్వం టపా చదివి పాత టపా లు తిరగవేసా...ఇంటరెస్టింగ్ గా వున్నాయి.
ReplyDeleteNaakenduko Chaduvukogalige avakaasam adrustam anipustundi.. athi koddi pettubaditho athi eakkuva labdhi(laabham) ponde insurnace laa anipistundi..
ReplyDeleteNaa matuku nenu, chaduvukone avakaasaanni poorthigaa use chesukoledemo anipistundi.. life lo chaala dooram vochesaa.. Edo maa naanna gaari punyama ani rendu PG lu, one more uncompleted (du to abroad trip) MBA tho migilaa...
Chaduvukovatam ante padi chastaa..
Chaduvukomante Chachi koodaa legusta..
Chadvukune vaallanu chooosi aanandistaa..
Chaduvukovaali anukune vaallaku aaseerwadistaa..
:-)
చిన్ని గారు, నా బ్లాగ్ మీకు నచ్చినందుకు థాంక్స్.....
ReplyDelete