Wednesday, April 22, 2009

IIIT-Hyderabad లో రెండు సంవత్సరాలు.............

అది నేను IIIT -H లో చేరే రోజు, 9:00 కల్లా వచ్చేయమన్నారు కాలేజీ లో జాయిన్ అవ్వటానికి ..8:50 కల్లా కాలేజీ వెళ్లి కూర్చున్నాను. తీరా అక్కడికి వెళ్తే అందరికి call letters పంపారు నాకు తప్ప. ఇక నా టెన్షన్ చూడాలి దేవుడా జాబు కి resign చేసి మరీ ఇక్కడ చేరటానికి వచ్చాను, ఇప్పుడు call letter లేదు నిన్ను చేర్చుకోమంటే ఏమి చెయ్యాలి రా అని. ఇంతలో ఇంకో టెన్షన్ ఫోటో లు compulsory అని చెప్పారు ఎవరో, నాదగ్గరేమో photo లు లేవు..ఇంక నా పరిస్థితి చూడాలి, దేవుడా నా జీవితాన్ని మంగళగిరి జాతర చేసావు కదయ్యా అనుకొన్నాను ....ఇంతలొ ఎవరో మేము ఆఫీసు లో కనుక్కోన్నాము call letter mandatory కాదంట, మెయిల్ వస్తే చాలంట అన్నారు. అమ్మయ్య ముందు కాలేజీ లో చేర్చుకొంటారు చాలు అనుకొన్నాను. అలా IIIT-Hyderabad లో నా జీవితం టెన్షన్ తో మొదలయింది.

మొదటిరోజు, ఏ ఏ classes ఎప్పుడు జరుగుతాయో time table పెట్టారు. వారానికి 4 రోజులే క్లాస్సేస్ అది రోజు కి maximum అంటే మూడు క్లాస్సులు...ఆహా సూపరు...అనవసరం గా job కి resign చేసాను శుభ్రం గా continue అయినా సరిపోయేది అని తెగ feel అయిపోయాను. మొదటివారం చాలా cool గా అయ్యాయి క్లాసులు..

రెండొవ వారం మొదలవ్వటం ఆలస్యం Assignmentlu start. లెగిస్తే APS (Advanced Problem Solving, full programming లెండి) assignment, కూర్చుంటే ITWS(ఇది కుడా ఒక subject లెండి మాకు first semster లో) assignment, పొడుకుంటే ComuperSystem(ఇది ఒక subject ఎ) project, gap దొరికితే Discrete Maths assignment. తినటానికి assignmentlu, తాగటానికి project లు ఇచ్చేవాళ్ళు. ప్రొద్దున 8:00 కి Hostel room నుంచి బయటపడితే, రాత్రి ఒకటో, రెండో అయ్యేది మల్లి రూమ్ కి వచ్చేప్పటికి. అసలు ఈ assignmentlu చెయ్యటానికి మేము పడిన కష్టం ఏ కొండలు పగల కొట్టడానికో పడితే, Hyderabad చుట్టుపక్కల ఒక్క కొండ కూడా మిగేలేది కాదు first semester అయ్యేపటికి. అప్పుడు అనిపించింది నాకు, GATE లో seat వచ్చి M.Tech చెయ్యడానికి వెళ్తే పెద్దగా చదవనవసరం లేదు అన్న వాడిని ఎడంకాలి చెప్పుతో కొట్టాలి అని.

రెండొవ వారం లోనే నాకు ఇంకో shock తగిలింది IIIT-H లో. మాకు assignmentla తో పాటు ఎప్పుడైనా కాళీ దొరికితే ఎక్కడ చెడిపోతామో అని ప్రతి వారం రెండు APS lab లు, ఒక ITWS lab పెట్టెవాళ్ళు. APS lab లో రెండు programs ఇస్తారు అవి మనం solve చేసి అదే రోజు రాత్రి 12:00 లోపు upload చెయ్యాలి. అర్దరాత్రి 12:00 కి deadline ఏంటి అనుకొంటున్నారా, అదంతే ఇక్కడ IIIT-H లో మేము దెయ్యాలు తిరిగే టైం లో తిరుగుతాం, మనుషులు తిరిగే టైం లో పడుకొంటాం. అలా అని మమ్మల్ని దెయ్యలనుకొంటే అది మీ ఖర్మ.

అది APS మొదటి lab మా APS TA (Teaching Assistent) లు, ఆ రోజు చెయ్యవలసిన రెండు program లు ఇచ్చారు. (అప్పటివరకు మా తొక్కలో SriJi college లో ఇక్కడ IIIT లో పిల్లోల్లు చడ్డిలేసుకోనేటప్పుడు చేసే programs చేసి పెద్ద programmer అని feel అయ్యేవాడిని. ) lab session లో మొదటి గంట అయ్యింది నాకు program ఏంటో ముక్క అర్ధం అయితే వొట్టు. అలా నేను జుట్టు పీక్కుంటూ వుండగా, ఒకడు లేసి నా program అయిపొయింది అని చెప్పాడు. నాకు sound లేదింక. ఆరోజు నేను ఆ రెండు programs అర్దరాత్రి 11:59:59 కి upload చేసాను. అదే వారం లో రెండో lab మల్లి రెండు programs ఇచ్చారు. మల్లి నాకు ముక్క కూడా అర్ధంకాలేదు (అని వేరే చెప్పాలా). మొదటి half అయ్యింది interval కొట్టటం ఆలస్యం ఒక అమ్మాయి లేచి నేను చేసేసాను programs అనింది. ఎదావిది గా నేను 11:59:59 కి upload చేసాను programs. అలా first semester అంతా deadline లతో పండగ చేసుకోన్నాం.

ఐతే పన్నెండేల్లకోసారి గోదావరి పుష్కరాలోచ్చినట్లు మాకు ఎప్పుడన్నా ఒక రోజు కాళీ దొరికేది ఇంక ఆరోజు జాతరే. అలా ఓరోజు మాకు కాళీ దొరికింది నేను ఇంకో ఇద్దరు స్నేహితులం కలసి సినిమా థియేటర్ చూసి రెండు నెలలు అయ్యిందని తెగ బాధపడి, ఒక గంట తీవ్రం గా చర్చలు జరిపి యమదొంగ సినిమాకి వెళ్దాం అని decide అయ్యాం. తీరా మెహదిపట్నం(సినిమా థియేటర్ వున్న ప్లేస్) వెళ్తే టికెట్లు అయిపోయాయి. ఇంకేముంది వుసూరుమంటూ వెనక్కితిరిగి వస్తూ దారిలో మిరపకాయ బజ్జీలు తినివచ్చాం. college దగ్గరికి వచ్చాక classamate ఒకడు ఎక్కడకిరా వెళ్లివస్తున్నారు అని అడిగాడు. మేమేదో ఎటకారం గా మెహిదిపట్నం వెళ్లి బజ్జీలు తిని వస్తున్నాం అంటే వాడు ఆశ్చర్యం గా అరేయ్ 12 కిలోమీటర్లు వెళ్ళే బజ్జిలు తిన్నారా మీరు, మీకు ఇక్కడ పక్కనే ఇందిరానగర్ లో బజ్జీలు దొరుకుతాయని తెలియదా అనేప్పటికి మేము అంతదూరం వెళ్లి tickets దొరకలేదు అనే బాధని మర్చిపోయి హాయిగా నవ్వేసాం.
అలా first semster మూడు assignmentlu ఆరు deadline ల తో గడిపేశాం.

మిగతా మూడు semester లు గురించి మనం తరవాతి బాగం లో మాట్లాడుకొందాం అంతవరకు సెలవు. ఎందుకంటే టైం పొద్దున్న 4:00 అయ్యింది కాబట్టి, నాకు నిద్రొస్తుంది కాబట్టి, రెండు రోజుల్లో ఒక project deadline వుంది కాబట్టి......

14 comments:

  1. Telugu blog loo ekkuvu english eee undi.., Adedoo.., nee kastalu english loonee rayochugaa.... :).,

    Full gaa rayanappudu.. "IIIT H loo first semister" ante sapri pooyeedigaa.. :)

    ReplyDelete
  2. baagundhi Narendra post...oka flashback chusinattuga undhi......

    ReplyDelete
  3. బ్లాగ్లోకంలోకి కి మరొక IIITian ఆరంగ్రేటం.. స్వాగతం బాసూ!! నేను కూడా ఈ బాధలు పడుతూ ఉన్న వాడినే.. MS by R ఆఖరి సెం లో ఉన్నాను.. :) సాటి IIITian గా కష్టాలు అన్ని గుర్తు చేసావు..!!

    ReplyDelete
  4. ఫణి గారు, మీ స్వాగతానికి థాంక్స్....మెమ్మల్ని నేను pg2 ల్యాబ్ లో చుసాను చాలాసార్లు..నేను కూడా ORACLE లో నే పని చేసి వచ్చాను రెండు సంవత్సరాలు...
    అవునుమరి IIIT-H లో ఎవర్ని కదిలించి నా ఈ assignmentla కష్టాల గురుంచి కదలు కదలు గా చెప్తారు.

    ReplyDelete
  5. enti anta kashta paddara memu iits lo kuda face cheyaleduga assignments commengada...........danike alaante elaboss........m.tech ki b.tech ki ade difference............ieee papers 10 days lo implement cheyamantaru..........naku asalu kashta paddatle anipinchaledu.........

    ReplyDelete
  6. ha ha ha.
    So, are you done now?
    లేక కష్టాలు అలవాటైపోయాయా?

    ReplyDelete
  7. వినయ్ గారు, ఏమిచేయ్యమంటారు, spoj, ACM, TopCoder లోంచి వెతికి మరి programs ఇస్తారు. ఒకరోజులో 2 ACM questions solve చెయ్యటం ఎవరికైనా కష్టమే అని నా అభిప్రాయం. మాకు కుడా research papers implement చెయ్యమని చెప్తారు. Infact చాల courses లో assignment లు అలానే వుంటాయి.
    matteru B.Tech ఆ M.Tech ఆ అని కాదు assignment standard ఎంత వుంది అని. మాకు ఇక్కడ చాలా courses common గా వుంటాయి B.Tech వాళ్ళకి, M.Tech వాళ్లకి.

    ReplyDelete
  8. కొత్త పాళీ గారు, కష్టాలు అలవాటైపొయ్యండి. అందుకే రెండు deadlines వరసలో వున్నా కొత్త టపా ఒకటి రాసాను.

    ReplyDelete
  9. అంత భయంకరమైన హడావుడిలో కూడా బ్లాగ్లో పోస్ట్ లు పెడుతున్నారా..మీరు సామాన్యులు కారండీ బాబు :)

    ReplyDelete
  10. >>GATE లో seat వచ్చి M.Tech చెయ్యడానికి వెళ్తే పెద్దగా చదవనవసరం లేదు అన్న వాడిని ఎడంకాలి చెప్పుతో కొట్టాలి అని.

    బాగున్నాయి కబుర్లు. పనిలో పనిగా పి.హెచ్.డి కూడా లాగించెయ్యండి.

    ReplyDelete
  11. నేస్తం గారు, చెప్పాలంటే నేను తెలుగు బ్లాగ్ లు చదవడానికి addict అయిపోయాను....

    ReplyDelete
  12. భాస్కర రామి రెడ్డి గారు, చెయ్యాలనే వున్నా పరిస్థితులు అనుకూలం గా లేవు ఇప్పుడు....

    ReplyDelete
  13. >>అలా అని మమ్మల్ని దెయ్యలనుకొంటే అది మీ ఖర్మ.
    అదీ సంగతీ..ఇప్పుటిదాకా ఇలా అర్ధం చేస్కున్నా, ఏంట్రా దయ్యాలా భూతాలా అని.
    సర్లేబాసూ, మోట్ & క్యాండిల్ కొనుక్కో, డిస్క్రీట్ మ్యాత్ కి. అరిపించు.
    అందుకే, ప్రాబ్లం సాల్వింఘ్ స్కిల్స్ డెవలప్ చేస్కోరా బాబూ అని ఆరోజునే చెప్పానా సిలక్కి సెప్పినట్టు ఇన్నావా? ఇన్లా ఇప్పుడుజుడూ ఓ అని తెగ ఇదైపోతన్నావ్.

    ఇంతకీ ఏసీయం అనగా అసోసియేషన్ పర్ కంప్యూటింగ్ మషినరీ అనా?
    మనం దాంట్లో ప్రొఫెషనల్ మెంబర్లంలే. అందుకే అడిగా.

    ReplyDelete