ఎప్పుడు మొదలైందో మా స్నేహం నాకు సరిగా గుర్తు లేదు, ఉహ రాకముందునుంచి అనుకొంటాను. మా నాయనమ్మ పరిచయం చేసిందట వాడ్ని నాకు మా అమ్మ చెప్తుంది. ఆతరవాత వాడు కనిపించక పోతే అన్నం కూడా తినేవాడ్ని కాదట ఇది కూడా మా అమ్మే చెప్పింది.
కోపం వచ్చిన, బాధొచ్చినా, సంతోషం వచ్చినా నేను మొదట చెప్పేది వాడికే. నా జ్ఞాపకాల దొంతరల్లో ప్రతి పుటా వాడికి పరిచయం. వాడ్ని మొదటిసారి చూసినప్పుడు ఎంత ఆనందం వేసిందో నాకు గుర్తులేదు కాని వాడ్ని కలిసిన ప్రతిసారి ఏదో తెలియని ఆనందం.
వాడు నాకు పరిచయం అయ్యింది మొదలు ఇంత వరకు వాడ్ని కలవకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు నేను. వాడు నా మొదటి స్నేహితుడు వాడి పేరు TEA.
Tuesday, July 27, 2010
Tuesday, January 12, 2010
ఏవి ఆ భోగి సంబరాలు??
చిన్నప్పుడు, సంక్రాంతి పండగోస్తుందంటే సంబరమే సంబరం. ఎందుకంటే ఎ పండగకి బట్టలు కొనకపోయినా సంక్రాంతి పండగకి మాత్రం కచ్చితంగా కొత్త బట్టలు కొనిపెట్టేవాళ్ళు.
ఇంకోటి భోగి, ఆ రోజు జరిగే భోగి మంట పందాలు. ప్రతి బజారులో ఎవడు పెద్ద భోగి మంట వేస్తాడు అని పందెం. గెలిసినవాడు ఆ రోజు చొక్కా కాలరు ఎగరేసి ఊరంతా తిరిగి వాడి గెలుపు గురించి కధలు కధలు గా చెప్పే వాడు. భోగి మంట పందెం లో గెలవాలంటే అంత వీజీ కాదు. దానికి మంచి strategy కావాలి దాన్ని పక్కా గా అమలు చెయ్యాలి. మా అన్న దీనిలో మంచి పండితుడు(strategist) . మా బజార్లో ఎప్పుడు మేమో గెలిచే వాళ్ళం.
మేము 5-7 తరగతులు మా అమ్మమ్మ వాళ్ళ వూళ్ళో చదివాము. అక్కడ కారుమంచి గడ్డి అని, బాగా జొన్న చొప్పంత ఎత్తు పెరుగుతుంది. మేము సంక్రాంతి నెల పెట్టటం ఆలస్యం ప్రతి ఆదివారం ఆ గడ్డి కోసుకు రావటం ఎండ పెట్టటం. భోగి రెండు రోజులు వుంది అనంగా వాటిని చిన్న చిన్న మోపులు కట్టి నిలపెట్టే వాళ్ళం. ఇంక భోగి రోజు వాటికీ మంట పెడితే ఆకాశానికి తాకుతున్నాయా అన్నంత ఎత్తు మండేవి. ఇంకేముంది మా బజరులోనే కాదు పక్క బజారులో కూడా మేమే కింగులు.
7-10 మా ఊర్లో అక్కడ జొన్న చొప్ప, మొక్కజొన్న కంకేల మీద వుండే పొత్తులు పండగ టైం కి బాగా దొరికేవి. భోగిరోజుకి వీలైనంత ఎక్కువ వీటిని పోగేయ్యటం ఓ రెండు మూడు గంటలు మంట వెయ్యటానికి సరిపడా "అన్న"మాట. ఇంకా ఆ రోజు సాయంత్రం దివిటిల ఆట... అంటే, జొన్న చొప్పకి చివర మంట పెట్టి తిప్పుతూ వుంటారు. మనకి దివిటి తిప్పే అనంత సీన్ లేదు కాని, కూర్చొని దివిటి తిప్పటం చూడడం ఒక సరదా అంతే.
కానీ ఇప్పుడు ఏవి ఆ సంబరాలు. పొద్దు పొద్దునే ఆఫీసు కి వస్తూ ఆ రోజులని గుర్తుకు తెచ్చుకోవటం తప్ప.

Monday, January 4, 2010
శ్రమైక జీవన సౌందర్యం .....
అవ్వటానికి రైతు బిడ్డనే అయినా, చాలా సార్లు పొలంపని చేసినా శ్రమైక జీవన సౌందర్యం గురించి నాకు పూర్తిగా అవగతం కాలేదనే చెప్పాలి. ఈరోజు, దాని గురించి మొత్తం తెలియక పోయిన కొంత వరకు తెలిసిందనే చెప్పాలి. ఎలా అంటారా నేను ఒక సైకిల్ కొన్నాను, దాని మీదే ఈరోజు ఆఫీసుకి వెళ్ళాను. ఐతే ఏంటి అంటారా నేను వుండేది కుకట్ పల్లి లో, ఆఫీసు ఏమో హైటెక్ సిటీ లో. దగ్గర దగ్గర 8KM వుంటుంది అనుకొంటాను. ఇప్పడు ఏమంటారు??.
ఏంటి 8KM కే శ్రమైక జీవన సౌందర్యం లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా అంటారా సరే ఐతే అసలు విషయం లో కి వచ్చేద్దాం.
అసలేమయింది అంటే మొన్న ఒకరోజు హడావుడి గా ఆఫీసు నుంచి ఇంటికి వస్తుంటే, హైటెక్ సిటీ స్టేషన్ దగ్గర ఒక పిల్లోడు ఆపాడు, ఇంటర్మీడియట్ చదువుతూ వుంటాడనుకొంటాను అన్నా ఒక రెండు నిముషాలు నీ టైం ఇస్తే నేను ఒక విషయం చెప్తాను అన్నాడు. సరే చెప్పు చిన్నా అన్నాను. గ్రీన్ పీస్ గురించి ఒక అర్ధ గంట చెప్పాడు అర్ధ గంట తరువాత, అన్నా, నీవంతు గా భూమాతని కాపాడటానికి ఏమి చేస్తున్నావన్నాడు. అబ్బో చాలా చేస్తున్నా తమ్ముడు, పెరుగు షాపువాడు పోలతీన్ కవర్ ఇచ్చినా తీసుకొను, డైలీ బస్సు లో ఆఫీసు కి వెళ్తున్నాను(బండి కొని పెట్రోల్ తగలెయ్యకుండా ) అలా చెప్పుకుంటూ పోతుంటే, ఆ పిల్లోడు అన్నాయ్ నువ్వు భూమిని పాడు చేసేది కొండంత ఐతే నువ్వు చేస్తుంది గోరంత అని బ్రెయిన్ వాష్ చేసి పంపాడు.
అలా ఆ పిల్లోడి చెప్పిదాని గురించి ఆలోచిస్తూ ఇంటికి వచ్చాను. ఇంక ఎప్పటినించో గొలుసులతో కట్టేసిన ఆత్మారాముడు ఒక్క సారి గొలుసులు తెంచుకొని ముందొచ్చి నిలబడ్డాడు. తరువాత వళ్ళు విరుచుకొని వొరేయ్ అబ్బాయ్, నీ బతుక్కి ఎలాగు ఆ పిల్లాడిలా, నిద్రావస్తలో ఉన్నవాళ్ళని జాగృత పరచలేవు, కాలేజీ లోంచి బయటపడి మూడు నెలలు అయ్యిందో లేదో కొవ్వు పెరిగి వూరిపోతున్నావు కాబట్టి, ఆ కాబట్టి రెండు విడతల పదకం అమలు పరచాల్సిందే అని గొంతు చించుకొని అరిచాడు.
ఇంక ఆత్మారాముడి ఘోష బరించలేక, మొదటి విడతలో కాఫీమగ్గ్ ఒకటి కొన్నాను. మీకు తెలియదుగా నేను రోజుకి నికరంగా ఐదు, ఆరు సార్లు కాఫీ తాగుతాను. ప్రతిసారి ఒక పేపర్ కప్ తగలేయకుండా మగ్గ్ అన్నమాట. రెండొవ విడతలో సైకిల్ కొన్నాను, ఇంకో college mate + collegue తో కలసి. అలా ఈరోజు ఆఫీసు కి సైకిల్ మీద వెళ్ళటం, మీకు ఈ సుత్తి అంతా చెప్పటం జరిగింది.
సైకిల్ తొక్కుకు ఆఫీసు కి వెళ్లేసరికి వొళ్ళు పులిసిపోయింది కాని, శుభ్రం గా నేను, నా ఫ్రెండ్ చిన్నప్పటి రోజులు గుర్తుకు తెచ్చుకోన్నాం. ఆఫీసు కి వెళ్ళాక, రోజు కుర్చొంటే ఇబ్బంది గా వుండే ఆఫీసు లో నా కుర్చీ చాలా సౌకర్యం గా అనిపించింది. రోజు తిట్టుకొంటూ తినే భోజనం బ్రహ్మాండం గా అనిపించిది బాగా ఆకలేసింది మరి (కాలితే గుఱ్ఱం గానుగ చెక్క తింటుంది అంటారు చూడండి అలా). అందుకే శ్రమైక జీవన సౌందర్యం అనే పెద్ద మాట వాడానండి బాబు........
నాతో పాటు సైకిల్ కొన్న మిత్రుడు ఒక comic గీశాడు దీనిమీద... దాన్ని ఇక్కడ చూడండి..
http://fullbc.in/index.php?comicid=54

Saturday, November 21, 2009
బాచిలర్ గా నా కష్టాలు-I
IIIT-Hyderabad లో వున్న అన్ని రోజులు జీవితం ప్రశాంతం గా గడిచిపోయింది...అడపాదడపా ప్రాజెక్టులు ఎప్పుడు assignmentlu తప్ప మిగతా జీవితం అంతా పూలపాన్పు లాగా వుండేది.......ఒకసారి IIIT నుంచి బయటపడ్డాక అర్ధం అయ్యింది జీవితం పూలపాన్పు కాదు కంకర రోడ్ అని (టెక్నికల్ గా చెప్పాలంటే జీవితమంటే assignemntlu, projectule కాదు వుండటానికి ఇల్లువేతుక్కోవడం, తినడానికి భోజనం వండుకోవడం కూడానని.....)
కాలేజీ నుంచి బయటికి వచ్చాక మొదట మిస్ అయింది కాలేజీ మెస్ నే... మా కాలేజీ మెస్ లో భోజనం ఎంత చండాలంగా వున్నా, ఒకటికి మూడు మెస్ లు వుండడంతో ఎలాగో ఒకలా తినేసేవాళ్ళం...ఆదివారం వస్తే మా ఆస్థాన Restaurant K.K.D (కదిలి వచ్చిన కనకదుర్గ) కి వెళ్ళేవాళ్ళం. మా కాలేజీ కి దగ్గరలో(నడుచుకుంటూ వెళ్ళేంత) ఈ ఒక్క Restaurant వుండటం తో, వున్న మిగతావన్నీ pizzaa లు (తెలుగు లో చెత్త) Burger(తెలుగు లో చెదారం) అమ్మేవే వుండడం తో ఎప్పుడు ఈ Restaurant కే వెళ్ళే వాళ్ళం. ఐన మా Restaurant ల visiting గురించి పెద్ద కధే వుంది ఆ కధ గురుంచి ఇంకో టపా లో చూద్దాం. ఇప్పటి రోజులకొస్తే, ..రూమ్మేట్ లు ఎంత చండాలం గా వంట చేసిన తినవలసిందే..లేదంటే కాలేజీ రోజులని గుర్తు తెచ్చుకొని ఏడవడమే..ఇంకా ఏడుపు రాకపోతే మన తోడని మనమే గిల్లుకొని ఏడవడమే. ఈ విషయం లో ఇంకో తలనోప్పెంటంటే వారం లో రెండు/మూడు రోజులు మనం వంట చెయ్యాలి. ఆఫీసు నుంచి వచ్చి హాయిగా కాసేపు ఎ పుస్తకమైనా చదువుకొందాం , లేదు ఏదైనా సినిమా చూద్దాం అంటే అబ్బే ఎక్కడ వంట చెయ్యాలి అంటారు రూమ్మేట్ లు. పైపెచ్చు ఎంతో కష్టపడి వంట చేస్తే కూరలో వుప్పు తగ్గిందనో లేకపొతే, అన్నం మెత్తగా వుందనో అంటారు. ఆ టైం లో ఒక్కసారి ఇంట్లో వున్న రోజులు గుర్తువస్తాయి. పొద్దునే నిద్రలేచి అమ్మమ్మ ఎంతో కష్టపడి, కాలేజీ లో మద్యాన్నం తినడానికి భోజనం, పొద్దునే తినడానికి టిఫిన్ చేసి పెడితే, ఎన్ని సార్లు అది బాగోలేదు ఇది బాగోలేదు అని అరిచే గందరగోళం చేసానో గుర్తుకొస్తుంది. అప్పుడోసారి అద్దం ముందుకెళ్ళి ఛి నీమొకం మీద కాకి రెట్టెయ్య అని రవితేజ స్టైల్ లో చెయ్యాలనిపిస్తుంది(మనలో మనమాట చాల సార్లు చేశాకూడా ) . ఈ వంట కష్టాలు చెప్తే తీరేవి కాదు, అవి అనుభవించి తెలుకోవలసిన కష్టాలు.
ఉపసంహారం
==========
మొన్నీమధ్య ఒక శుక్రవారం రాత్రి చికెన్ సెంటర్ కి వెళ్ళాం నేను నా రూమ్మేట్ ఒకడు కలిసి..ఎంత చికెన్ తీసుకోవాలి, ఎవడు వండాలి అని మాట్లాడు కొంటు వుండగా ఒకతనోచ్చి ఏంటి తమ్ముడు ఏంటి ఏమి చేస్తున్టావ్ నువ్వు అని అడిగాడు, తరవాత మా రూమ్మేట్ ని అడిగాడు. మేము చెప్పాక ఏంటి దేని గురించి మాట్లాడుకొంటున్నారు వీకెండ్ పార్టీ గురించా? .ఎంజాయ్ చెయ్యండి తమ్ముడు ఇప్పుడే ఎంజాయ్ చెయ్యాలి, పెళ్లి అయ్యాక ఇదిగో నాలాగా ఉసూరు మంటూ మార్కెట్ రావాలి అన్ని తీసుకువెళ్ళాలి, పెళ్ళాం ఎలా చేసిపెడితే అల తినాలి అంటూ తెగ బాధపడిపోయాడు...అప్పుడు నేను మావోడు ఒకడి మొకం ఒకడు చూసుకొని..ఇలా అనుకొన్నాం పీత బాధలు పీతవి, సీత బాధలు సీతవి...ఇంకో టపా లో బాచిలర్ లు అద్దెకి ఇల్లు అనే కాన్సెప్ట్ తో కలుద్దాం

Sunday, November 1, 2009
అలా తెలిసింది నాకు సైట్ వుందని...
అవి నేను కొత్తగా జాబు లో చేరిన రోజులు. నాకు, నాతొపాటు చేరిన ఇంకో ఒకడికి కలిపి ఒక మెంటార్(రమేష్ బండారి) వుండే వాడు. తను ప్రతిదానికీ క్లాస్సులు పీకుతూ వుండేవాడు. అప్పట్లో నేను software engineer అనేవాడు సిస్టం reselution చాలా తక్కువ పెట్టుకొని సిస్టం వైపు కళ్ళు చికిలించుకొని చూడాలి అనుకొనే వాడ్ని.
అలా నేను సిస్టం చూడడం చూసి చూసి ఒకరోజు మా మెంటార్ వచ్చి నీకు సైట్ వుంది అందుకే సిస్టం వైపు అలా కళ్ళు చికిలించుకొనే చూస్తావు, అర్జెంటు గా eye టెస్ట్ చేఇంచుకో అన్నాడు, అప్పుడు నేను, పిచ్చోడా ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నాకేంటి సైటు ఏమిటి? neverrr, నీకు తెలిదా software engineer అనేవాడు సిస్టం వైపు అలా కళ్ళు చికిలించుకొని చూడాలి అన్నాను. తనేమో అంతలేదు నేను నీలాగే అనుకొనే వాడ్ని, ఇప్పుడు చూస్తున్నావ్ గా నా అద్దాలు, ముందు టెస్ట్ చేఇంచుకో అన్నాడు. నేను ఆ మాటలు పెద్దగా పట్టించుకోలేదు. అలా రోజులు జరుగుతూ వున్నాయి. రమేష్ ఎప్పుడు నా desk దగ్గరకు వచ్చినా నా eye సైట్ గురించే మాట్లాడే వాడు.
ఒకరోజు నాకు కొంచం దూరంగా కూర్చునే మా ఫ్రెండ్ డెస్క్ వైపు చూసాను డెస్క్ మీద వుండే వాడి పేరు సరిగా కనిపించలేదు, ఏంటో బూసర బూసర గా కనిపించింది. అప్పుడు వచ్చింది నాకు అనుమానం , కొంపతీసి నాకు సైట్ వుందా ఏంటి! అని. ఇంకా ఆరోజు నుంచి ఆఫీసుకి వచ్చేటప్పుడు, ఆఫీసు నుంచి వెళ్ళేటప్పుడు బస్సులోంచి రోడ్ మీద వున్న షాపుల పేర్లు, hording ల మీద వున్న అక్షరాలు చదవడానికి ట్రై చేసివాడిని. దూరంగా వున్న అక్షరాలు చూసినపుడు అవి సరిగా కనిపించేవే కాదుకదా పైపెచ్చు డాన్స్ చేస్తున్నట్లు కనిపించేవి. కాని నేను అంతా నా భ్రమా, బ్రాంతి మనకు సైట్ ఏంటి అబ్బే ఛాన్స్ లేదు అనుకొనే వాడిని.
కాలక్రమంలో ఇంకో 3 నెలలు జరిగిపోయాయి. ఒక మంచి(one fine) వీకెండ్ లో సరదాగా సినిమాకి వెళ్ళాను. కొంతసేపు అయ్యాక పక్కనే వున్న మా ఫ్రెండ్ తోటి ఒరేయ్ అంత సీరియస్ సీన్ లో ఎంట్రా ఆ హీరోగాడు డాన్స్ చేస్తున్నాడు అన్నాను. అపుడు వాడు ఒరేయ్ మీ మెంటార్(రమేష్ బండారి) చెప్పేది నిజమే నువ్వు అర్జెంటు గా eye టెస్ట్ చేఇంచుకో అన్నాడు. ఆ తరువాతి వారమే L.V Prasadh eye hospital కే వెళ్ళాను. అన్ని టెస్ట్లు అయినతరువాత డాక్టర్ స్లోమోషన్ లో కళ్ళఅద్దాలు తీసి బాబు నీకు సైట్ వుందమ్మా అన్నాడు. ఇంకేముంది సినిమాల్లో చూఇంచి నట్లు సముద్రాలూ పొంగాయి, మెరుపులు మెరిసాయి, పిడుగులు పడ్డాయి. నేను గట్టిగా డాక్టర్ ర్ ఏంటి మీరు చెప్పిడి అని NTR లెవెల్లో అడిగాను, అప్పుడు డాక్టర్ అంత లేదమ్మా నీకొచ్చింది సైట్, కాన్సర్ కాదు అంత ఎమోషనల్ డ్రామా అవసరం లేదని ప్రేస్క్రిప్షన్ రాసిచ్చాడు.
అలా నాకు సైట్ వుందనే విషయం తెలిసిందారోజు. సైట్ వస్తే వచ్చింది కాని కళ్ళ అద్దాలు వచ్చాయి :-) ఇంకా ఎవర్ని అద్దాలివ్వవా ఒకసారి పెట్టుకు చూస్తాను అని అడగనవసరం లేదు అని, నాకు నేను సర్ది చెప్పుకొన్నాను.
Thanks
Narendra Chennupati

Tuesday, May 19, 2009
క్రికెట్ నేర్చుకోవడం బ్రహ్మ విద్యే
అదో నడి వేసవి కాలం మిట్టమధ్యాహ్నం సమయం 12:౦౦ దైవాలరావూరు (అనగా మా వూరు, కానీ ఆటో వాళ్ళ దగ్గర నుంచి, బస్సు కండక్టరు వరకు అందరు దెయ్యాలరావూరు అని పిలేచివారే) టీం కి పమిడిపాడు టీం కి మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది మావూరి చవిటి పొలాల్లో. దైవాలరావూరు టీం ఇంకా 4 ఓవర్లు లో 60 పరుగులు చెయ్యాలి, చేతిలో 3 వికెట్స్ వున్నాయి. సమయం పన్నెండు మీదకి రాగానే బాట్స్మెన్ పోయేకాలం వచ్చే ఠపిమని అవుట్ అయ్యాడు. అప్పుడు దిగాడు ఒక బాట్స్మెన్, దొరకినది మొదలు బాలుని తుక్కురేగాకోట్టాడు. దైవాలరావురు టీం ని గెలిపించాడు. అతను కొట్టిన రున్స్ ఇలా వున్నాయి
6,4,6,4,6,1 | 4,6,4,6,6,1 | 6
అందరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బాట్స్మెన్ నే పైకిఎత్తి పొగడటం మొదలెట్టారు.. ఇంతకి ఆ బాట్స్మెన్ ఎవరో మీకు ఈపాటికే అర్ధం అయిపోయివుండాలి అది నేనే. నా క్రికెటింగ్ టాలెంట్ తెలిసిన వాళ్ళందరూ ఈ పాటికే షాక్ అయి వుంటారు. వాళ్ళందరు ముక్తకంఠం తో..ఇదంతా కలలో జరిగుంటుంది అని అంటారు...నిజమే ఇది జరిగిందీ కలలోనే..ఇదో పగటి కల...నాకు చిన్నప్పుడు క్రికెట్ గురించి తెలిసినప్పటినుంచీ కంటున్న కల ఇది...కాకపోతే అప్పట్లో పమిడిపాడు, దైవాలరావూరు ఐతే ఇప్పుడు ఇండియా, ఆస్ట్రేలియా టీం లు....
చాలామంది అడుగుతూ వుంటారు నన్ను అంత ఇంట్రెస్ట్ వున్నవాడివి ఆడటం నేర్చుకోవచ్చు గా అని....నేను నేర్చుకుందాం అనుకొన్న ప్రతిసారి టీం లో ఎవడో ఒక వెధవ వుంటాడు వాడు , మనం డిఫెన్స్ ఆడినా తిడతాడు, షాట్ లు కొట్టినా తిడతాడు..ఫీల్డింగ్ సరిగా చెయ్యకపోతే తిడతాడు...సరిగా చేద్దామని కిందపడి మరీ బాల్ ని ఆపితే ఏరా నువ్వేమన్నా తోపు అనుకొంటున్నావా ఏదో బాల్ దొరికింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమయేది extraa లు ఆపి మాములుగా చెయ్యి ఫీల్డింగ్ అంటాడు...నుంచుంటే తిడతాడు కూర్చుంటే తిడతాడు......ఇట్లాంటి పింజారి వెధవలతోటి మాటలు పడటం కంటే కదలకుండా కూర్చోవటం బెటరని నేర్చుకోలేదు. లేదు మా Z.P.H.S లో P.T నేర్పిస్తాడు అంటే ఆయనో --- --- (డాష్ డాష్) క్లాసు కో పది మంది పింజారి వెధవల్ని ఎన్నుకొని వాళ్ళకే volley ball నేర్పినా, లేదూ కబాడీ నేర్పినా, లేదూ ఇంకొంటి నేర్పినా......
అలా నాలో క్రికెట్ ఆడటం నేర్చుకోవాలనే కోరిక మాత్రం అలాగే వుండిపోయింది.....కానీ EA Sports వాళ్ళ క్రికెట్ గేమ్ లో మాత్రం మనం టాప్ అండోయ్....

Sunday, May 10, 2009
మా అమ్మ
చాల మంది అంటూవుంటారు, తల్లి కి సహజం గా చిన్న కొడుకంటే ఇష్టం, తండ్రికి పెద్ద కొడుకంటే ఇష్టం అని ......మా ఇంట్లో నేను చిన్నవాడిని.....అందరి అమ్మలలాగానే మా అమ్మ కూడా కాకపోతే నా విషయం లో ఆ ఇష్టం అందరికంటే కొంచం ఎక్కువ....ఇప్పటికి మా అమ్మ నన్ను ఎప్పుడైనా బతిమాలలంటే మా చిన్న కదు మా కన్నా కాదు అంటూ వుంటుంది....మా అన్న కుళ్ళుకుంటూ వుంటాడు ఎప్పుడు నన్ను చూసి......మా అమ్మ దేనికైనా నన్ను పిలవటం ఆలస్యం, మా అన్న అందుకొని చిన్నా కన్నా ఎక్కడున్నావమ్మా అంటూవుంటాడు..
ఇప్పుడంటే ఇలా వుంది కాని నేను పుట్టినప్పుడు మా అమ్మ నన్ను నాకు వీడు వద్దు తీసుకెళ్ళి దిబ్బలో కొట్టండి అనిందంట...ఎందుకంటే మా అమ్మకి ఆడపిల్లలంటే చాల ఇష్టం..మా అన్నయ్య పుట్టిన తరువాత కాన్పులో ఆడపిల్ల పుడుతుంది అని చాలా ఆశ పడిందంట ....కాని నేను పుట్టేటప్పటికి నేను వాడి మొహం కూడా చూడను నాకు వద్దు అనిందంట .....నేను పుట్టిన హాస్పటల్ లో పనిచేసే డాక్టర్ నేను కనిపించిన ప్రతిసారి..ఏమ్మా వీడినే కదూ నువ్వు దిబ్బలో కొట్టమనింది అనే అడిగేవాడు......నేనైతే సిగ్గుతో చచ్చి పోయేవాడిని...
అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు నన్ను,మా అన్నని మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలి అమ్మ,నాన్న ఇద్దరూ కర్నాటక కి వ్యవసాయం కోసం వెళ్ళినప్పుడు మా అమ్మకళ్ళ లో ఎంత బాధ చూసానో....నేను ఇంటికివెళ్ళి తిరిగివచ్చే ప్రతిసారి మా అమ్మ కళ్ళలో అదే బాధ చూస్తాను....
నేను ఇంటికి వస్తున్నానని ఫోన్ చెయ్యడం ఆలస్యం నాకు ఇష్టం అని అట్లు కోసం అన్ని రెడీ చేసి పెట్టేస్తుంది......ఒక రోజు ఫోన్ చెయ్యకపోయినా ఒరేయ్ చిన్న నిన్న ఫోన్ ఎందుకు చెయ్యలేదు అని అడుగుతుంది.......ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం రాసేయవచ్చు...అందుకే నాకు ఎప్పుడూ గొప్పే మా అమ్మకి నేనంటే చాల ఇష్టం అని...
మళ్లీ జన్మంటూ వుంటే మా అమ్మకే కొడుకుగానే పుట్టాలి..అదీ చిన్న కొడుకుగానే పుట్టాలి.....
Wednesday, May 6, 2009
IIIT-Hyderabad లో రెండు సంవత్సరాలు-II
మొదటిరోజు కాలేజీ లోకి అడుగుపెడుతూ...మా కాలేజీ గేటు దాటగానే వచ్చే సర్కిల్ చూడగానే అనుకొన్నాను...ఇక్కడే కామోసు నేను రెండు సంవత్సరాలు వుండబోతోంది అని..... ఎలాంటి ఫ్రెండ్స్ దొరుకుతారో...మళ్లీ కాలేజీ లైఫ్ ఎలావుంటుందో..మా క్లాసు లో ఎలాంటి అమ్మయిలుంటారో..ఇలా ఎన్నో ప్రశ్నలతో అడుగుపెట్టాను కాలేజీ లోకి...
నిన్న బయటకు వెళుతూ మళ్లీ ఆ సర్కిల్ ని చూడగానే అనిపించింది....ఏంటో ఈ రెండు సంవత్సరాలు ఎలా అయిపోయాయో కూడా తెలియలేదు..projectlu, assignmentlu అని.....ఇప్పుడు ఇంకో 15 రోజుల్లో కాలేజీ ని వదిలి వెళ్ళాలంటే కడుపోలోంచి బాధ తన్నుకు వస్తోంది....ఒక సారి వెనకు తిరిగి చూస్తే ఆహా ఈ రెండు సంవత్సరాలలో జివింతాంతం గుర్తుంచుకోవటానికి సరిపడా తీపి గుర్తులున్నాయి...

--మొదటి semestaer లో రాత్రంతా కూర్చొని చేసిన assignmentlu, projectlu...
--రెండో semester లో Software Engineering కోసం వేసిన skitlu...రవి గాడి రూం లో కూర్చోని చూసిన సినిమాలు...స్వామి గాడి మీద వేసిన satire లు....
--నేను రవి గాడు , రాజు, స్వామి, వెంకి గాడు కలిసి వెళ్ళిన విశాకపట్టణం ట్రిప్...
---amazon.com లో internship....
--మూడో semester లో DWDM క్లాసు లో వెంక బెంచిలో కూర్చొని చదివిన నవలలు...ITWS TAship...
--Amazon లో జాబు రాలేదని తెలిసన రోజు పడిన బాధ
--palcement coordinator గా నా చివరి మీటింగ్..దానిలో నేను మాట్లాడిన మాటలు..మాట్లాడలేక పోయిన మాటలు..
--ఇదిగో ఈరోజు క్లాసుమేట్స్ తో జరిగిన get together....
ఈక్షణం దేవుడు ప్రత్యక్షమైతే నేను ఏమి కోరిక కోరుకుంటానో తెలుసా.....దేవుడా కాలాన్నీ రెండు సంవత్సరాల ముందుకు తీసుకెల్లవా అని...ఏంటో ఇదంతా రాస్తుంటే కళ్ళలోకి నీళ్ళు ఎప్పుడోచ్చాయో కూడా తెలియలేదు...
--రెండో semester లో Software Engineering కోసం వేసిన skitlu...రవి గాడి రూం లో కూర్చోని చూసిన సినిమాలు...స్వామి గాడి మీద వేసిన satire లు....
--నేను రవి గాడు , రాజు, స్వామి, వెంకి గాడు కలిసి వెళ్ళిన విశాకపట్టణం ట్రిప్...
---amazon.com లో internship....
--మూడో semester లో DWDM క్లాసు లో వెంక బెంచిలో కూర్చొని చదివిన నవలలు...ITWS TAship...
--Amazon లో జాబు రాలేదని తెలిసన రోజు పడిన బాధ
--palcement coordinator గా నా చివరి మీటింగ్..దానిలో నేను మాట్లాడిన మాటలు..మాట్లాడలేక పోయిన మాటలు..
--ఇదిగో ఈరోజు క్లాసుమేట్స్ తో జరిగిన get together....
Monday, April 27, 2009
ఎవరన్నారు మానవత్వం చచ్చిపోయిందని...
ఈరోజు, మా కాలేజీ లో చెరకు రసం తీసి అమ్మే ఆతని చెయ్యి నలిగి పోయింది రసం తీసే మెషిన్ లో పడి. స్టూడెంట్ ఒకతను, ఆ చరకురసం అమ్మే అతనిని హాస్పిటల్ లో చేర్చాలి 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది, అందరు మీ మీ డోనేషన్స్ ఇవ్వండి అని మెయిల్ కొట్టాడు . ఆ మెయిల్ చూసిన నేను మా pg2 ల్యాబ్ లో వున్న 12 మంది స్నేహితుల దగ్గర డబ్బులు కలేక్ట్ చేస్తే 1000 రూ అయ్యాయి. ఆ డబ్బులు తీసుకొనే నేను వెళ్తే, ఆసరికే 2,500 దాకా అయ్యాయి డబ్బులు అది 20 నిముషాలలో. అప్పుడు అనిపించింది నాకు, ఎవరన్నారు మానవత్వం చచ్చిపోయిందని మా IIIT-Hyderabad స్టూడెంట్స్ లో ఇంకా బతికే వుంది అని..
Wednesday, April 22, 2009
IIIT-Hyderabad లో రెండు సంవత్సరాలు.............
అది నేను IIIT -H లో చేరే రోజు, 9:00 కల్లా వచ్చేయమన్నారు కాలేజీ లో జాయిన్ అవ్వటానికి ..8:50 కల్లా కాలేజీ వెళ్లి కూర్చున్నాను. తీరా అక్కడికి వెళ్తే అందరికి call letters పంపారు నాకు తప్ప. ఇక నా టెన్షన్ చూడాలి దేవుడా జాబు కి resign చేసి మరీ ఇక్కడ చేరటానికి వచ్చాను, ఇప్పుడు call letter లేదు నిన్ను చేర్చుకోమంటే ఏమి చెయ్యాలి రా అని. ఇంతలో ఇంకో టెన్షన్ ఫోటో లు compulsory అని చెప్పారు ఎవరో, నాదగ్గరేమో photo లు లేవు..ఇంక నా పరిస్థితి చూడాలి, దేవుడా నా జీవితాన్ని మంగళగిరి జాతర చేసావు కదయ్యా అనుకొన్నాను ....ఇంతలొ ఎవరో మేము ఆఫీసు లో కనుక్కోన్నాము call letter mandatory కాదంట, మెయిల్ వస్తే చాలంట అన్నారు. అమ్మయ్య ముందు కాలేజీ లో చేర్చుకొంటారు చాలు అనుకొన్నాను. అలా IIIT-Hyderabad లో నా జీవితం టెన్షన్ తో మొదలయింది.
మొదటిరోజు, ఏ ఏ classes ఎప్పుడు జరుగుతాయో time table పెట్టారు. వారానికి 4 రోజులే క్లాస్సేస్ అది రోజు కి maximum అంటే మూడు క్లాస్సులు...ఆహా సూపరు...అనవసరం గా job కి resign చేసాను శుభ్రం గా continue అయినా సరిపోయేది అని తెగ feel అయిపోయాను. మొదటివారం చాలా cool గా అయ్యాయి క్లాసులు..
రెండొవ వారం మొదలవ్వటం ఆలస్యం Assignmentlu start. లెగిస్తే APS (Advanced Problem Solving, full programming లెండి) assignment, కూర్చుంటే ITWS(ఇది కుడా ఒక subject లెండి మాకు first semster లో) assignment, పొడుకుంటే ComuperSystem(ఇది ఒక subject ఎ) project, gap దొరికితే Discrete Maths assignment. తినటానికి assignmentlu, తాగటానికి project లు ఇచ్చేవాళ్ళు. ప్రొద్దున 8:00 కి Hostel room నుంచి బయటపడితే, రాత్రి ఒకటో, రెండో అయ్యేది మల్లి రూమ్ కి వచ్చేప్పటికి. అసలు ఈ assignmentlu చెయ్యటానికి మేము పడిన కష్టం ఏ కొండలు పగల కొట్టడానికో పడితే, Hyderabad చుట్టుపక్కల ఒక్క కొండ కూడా మిగేలేది కాదు first semester అయ్యేపటికి. అప్పుడు అనిపించింది నాకు, GATE లో seat వచ్చి M.Tech చెయ్యడానికి వెళ్తే పెద్దగా చదవనవసరం లేదు అన్న వాడిని ఎడంకాలి చెప్పుతో కొట్టాలి అని.
రెండొవ వారం లోనే నాకు ఇంకో shock తగిలింది IIIT-H లో. మాకు assignmentla తో పాటు ఎప్పుడైనా కాళీ దొరికితే ఎక్కడ చెడిపోతామో అని ప్రతి వారం రెండు APS lab లు, ఒక ITWS lab పెట్టెవాళ్ళు. APS lab లో రెండు programs ఇస్తారు అవి మనం solve చేసి అదే రోజు రాత్రి 12:00 లోపు upload చెయ్యాలి. అర్దరాత్రి 12:00 కి deadline ఏంటి అనుకొంటున్నారా, అదంతే ఇక్కడ IIIT-H లో మేము దెయ్యాలు తిరిగే టైం లో తిరుగుతాం, మనుషులు తిరిగే టైం లో పడుకొంటాం. అలా అని మమ్మల్ని దెయ్యలనుకొంటే అది మీ ఖర్మ.
అది APS మొదటి lab మా APS TA (Teaching Assistent) లు, ఆ రోజు చెయ్యవలసిన రెండు program లు ఇచ్చారు. (అప్పటివరకు మా తొక్కలో SriJi college లో ఇక్కడ IIIT లో పిల్లోల్లు చడ్డిలేసుకోనేటప్పుడు చేసే programs చేసి పెద్ద programmer అని feel అయ్యేవాడిని. ) lab session లో మొదటి గంట అయ్యింది నాకు program ఏంటో ముక్క అర్ధం అయితే వొట్టు. అలా నేను జుట్టు పీక్కుంటూ వుండగా, ఒకడు లేసి నా program అయిపొయింది అని చెప్పాడు. నాకు sound లేదింక. ఆరోజు నేను ఆ రెండు programs అర్దరాత్రి 11:59:59 కి upload చేసాను. అదే వారం లో రెండో lab మల్లి రెండు programs ఇచ్చారు. మల్లి నాకు ముక్క కూడా అర్ధంకాలేదు (అని వేరే చెప్పాలా). మొదటి half అయ్యింది interval కొట్టటం ఆలస్యం ఒక అమ్మాయి లేచి నేను చేసేసాను programs అనింది. ఎదావిది గా నేను 11:59:59 కి upload చేసాను programs. అలా first semester అంతా deadline లతో పండగ చేసుకోన్నాం.
ఐతే పన్నెండేల్లకోసారి గోదావరి పుష్కరాలోచ్చినట్లు మాకు ఎప్పుడన్నా ఒక రోజు కాళీ దొరికేది ఇంక ఆరోజు జాతరే. అలా ఓరోజు మాకు కాళీ దొరికింది నేను ఇంకో ఇద్దరు స్నేహితులం కలసి సినిమా థియేటర్ చూసి రెండు నెలలు అయ్యిందని తెగ బాధపడి, ఒక గంట తీవ్రం గా చర్చలు జరిపి యమదొంగ సినిమాకి వెళ్దాం అని decide అయ్యాం. తీరా మెహదిపట్నం(సినిమా థియేటర్ వున్న ప్లేస్) వెళ్తే టికెట్లు అయిపోయాయి. ఇంకేముంది వుసూరుమంటూ వెనక్కితిరిగి వస్తూ దారిలో మిరపకాయ బజ్జీలు తినివచ్చాం. college దగ్గరికి వచ్చాక classamate ఒకడు ఎక్కడకిరా వెళ్లివస్తున్నారు అని అడిగాడు. మేమేదో ఎటకారం గా మెహిదిపట్నం వెళ్లి బజ్జీలు తిని వస్తున్నాం అంటే వాడు ఆశ్చర్యం గా అరేయ్ 12 కిలోమీటర్లు వెళ్ళే బజ్జిలు తిన్నారా మీరు, మీకు ఇక్కడ పక్కనే ఇందిరానగర్ లో బజ్జీలు దొరుకుతాయని తెలియదా అనేప్పటికి మేము అంతదూరం వెళ్లి tickets దొరకలేదు అనే బాధని మర్చిపోయి హాయిగా నవ్వేసాం.
అలా first semster మూడు assignmentlu ఆరు deadline ల తో గడిపేశాం.
మిగతా మూడు semester లు గురించి మనం తరవాతి బాగం లో మాట్లాడుకొందాం అంతవరకు సెలవు. ఎందుకంటే టైం పొద్దున్న 4:00 అయ్యింది కాబట్టి, నాకు నిద్రొస్తుంది కాబట్టి, రెండు రోజుల్లో ఒక project deadline వుంది కాబట్టి......

Subscribe to:
Posts (Atom)